Selfie Video .. ప.గో. జిల్లా: సెల్ఫీ వీడియో కలకలం
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:37 PM
ఓ యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పుడు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప. గో. జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో సెల్ఫీ వీడియో (Selfie Video) కలకలం (Kalakalam) రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) యాప్స్‌లో డబ్బులు పోగోట్టుకున్నానని పేరుపాలెం బీచ్ (Pelupalem Beach)లో చనిపోతున్నానంటూ (Suicide)ఓ యువకుడు తన బంధువులకు సెల్ఫీ వీడియో పంపించాడు. దీనిపై పోలీసులకు (Police) ఫిర్యాదు అందడంతో పేరుపాలెం బీచ్‌లో మొగల్తూరు పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పేరుపాలెం సముద్రం ఒడ్డున ఉన్న బైకును కనుగొన్నారు. అది యువకుడిదిగా భావిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని ఇంటికి వెళ్లడానికి పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.
పెళ్లి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు..
మైనర్‌తో పెళ్లి చేయాలంటూ.. ఓ యువకుడు హల్ చేశాడు. ఏకంగా సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడ మండలం, రెడ్డిపల్లెకు చెందిన రంగప్ప మైనర్‌తో పెళ్లి చేయాలంటూ పట్టుపట్టాడు. పెళ్లి చేసేది లేదని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో రంగప్ప సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రంగప్పకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన సీఎం చంద్రబాబు
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News