YCP Leader Harassment: మహిళకు వేధింపులు.. వైరల్ అవుతున్న వైసీపీ నేత ఆడియో కాల్స్
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:52 AM
Harassment: భీమవరం వైసీపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ మహిళపై వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 26: ఏపీలో అధికారం కోల్పోయినప్పటికీ వైఎస్సార్పీ నేతల ఆగడాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు యెదేచ్ఛగా మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా భీమవరం వైసీపీ పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రామరాజు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు శివరంజని అనే మహిళ ఆరోపించింది. భీమవరం మున్సిపాలిటీలో మెప్మాలో టీఎల్ఎఫ్ ట్రెజరర్‌గా శివరంజని పనిచేస్తోంది. రామరాజు తరచూ తనకు ఫోన్‌లు చేస్తూ హింసించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రామరాజు వేధింపులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని మహిళ చెబుతోంది. పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. రామరాజు మాట్లాడిన ఆడియో కాల్స్‌ను శివరంజని బయటపెట్టింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలి ఆవేదన
‘‘భీమవరం పట్టణ అధ్యక్షుడిగా రామరాజు ఎన్నికైన సమయంలో శుభాకాంక్షలు తెలిపిందేకు సీహెచ్ కృపామణి తనను తీసుకెళ్లారు. ఆ తరువాత రామరాజు తనకు రోజూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామా, కార్ తీసుకురానా అంటూ కాల్స్ చేసేవాడు. అలా రెండు మూడు సార్లు లైంగింకంగా వేధించాడు. ఫిబ్రవరి 14న కృపామణి నన్ను తీసుకెళ్లి రామరాజుతో మాట్లాడాలని చెప్పారు. హ్యాపీ వాలంటైన్స్ డే అని చెప్పి కారులో నన్ను లాక్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ రోజు తప్పించుకుని పారిపోయాను. రామరాజుతో లైంగిక దాడి చేసేలా ప్రోత్సహించింది కృపామణి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాను. వెంటనే రామరాజు నాకు ఫోన్ చేసి బెదిరించాడు. కేసు వెనక్కి తీసుకోవాలని కృపామణితో పాటు రామరాజు బెదిరించారు’’ అని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా.. వైసీపీ నేత వేధింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీప వైసీపీ నేతల దుశ్చర్యలు ఆగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రామరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితురాలకి న్యాయం చేయాలని కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఆ ఎనిమిది మంది సురక్షితంగా తిరిగి రావాలంటూ...
Read Latest AP News And Telugu news