Share News

YS Sharmila : జనం ఛీ కొడుతున్నా తీరు మారదా?

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:37 AM

11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

 YS Sharmila : జనం ఛీ కొడుతున్నా తీరు మారదా?

  • 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండటానికా సభకు వచ్చింది?: జగన్‌పై షర్మిల ఫైర్‌

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరు మాత్రం మారలేదు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. సోమవారం ఆమె ఎక్స్‌లో స్పందించారు. ‘ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజరు కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? ప్రజల శ్రేయస్సు కంటే మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు. సభకు వెళ్లే దుమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్‌ చేస్తున్నాం’ అని అన్నారు. సోమవారం శాసనసభలో గవర్నర్‌ చేసిన స్రసంగంలో కొత్తదనమేదీ లేదని షర్మిలరెడ్డి పెదవి విరించారు. బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ అర్ధ సత్యాలు చెప్పారన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలపై కూటమి ప్రభుత్వం స్పష్టతను ఇవ్వలేదన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 04:38 AM