Paleti Krishnaveni: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటీ కృష్ణవేణి అరెస్ట్
ABN , Publish Date - Apr 16 , 2025 | 09:17 PM
Paleti Krishnaveni: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెను పల్నాడు జిల్లా దాచేపల్లికి తరలించనున్నారు.
గుంటూరు,ఏప్రిల్ 16: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటీ కృష్ణవేణి హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాలేటీ కృష్ణవేణిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఏపీ పోలీసులు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించనున్నారు.