March 2025 Bank Holidays Telugu: మార్చిలో బ్యాంకులకు ఇన్ని రోజులు సెలవులా.. RBI లిస్ట్ ప్రకారం..
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:57 PM
March 2025 Bank Holidays Telugu: మార్చి నెలల సగం నెలంతా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు పనిచేయవు. కాబట్టి, మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే RBI విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఏయే తేదీల్లో బ్యాంకులు ఉండవో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంకు తెరిచి ఉన్న తేదీలను పరిశీలించుకోకపోతే మీ సమయం వృథా అవ్వచ్చు.

March 2025 Bank Holidays Telugu: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేస్తారు. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు సాధారణ సెలవులకు కలిపి ఆర్‌బీఐ జాబితా ప్రకటించింది. హోలీ, రంజాన్ వంటి ముఖ్యమైన పండుగల సమయంలో, ప్రాంతీయ పండుగల సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. కాబట్టి, ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకుని బ్యాంకు పనులను సమయానికి పూర్చిచేసుకోండి.
RBI ప్రతి నెల బ్యాంకు సెలవుల జాబితాను రూపొందిస్తుంది. అలాగే ఈసారి మార్చి సెలవుల జాబితాను ప్రకటించింది. వచ్చే నెల 14 రోజుల పాటు సెలవులుంటాయని.. అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలలో ప్రభుత్వ సెలవు దినాలను పాటిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది.
మార్చి 2025లో RBI ప్రకటించిన సెలవుల పూర్తి జాబితా:
మార్చి 2025లో RBI ప్రకటించిన సెలవుల పూర్తి జాబితా:
మార్చి 2 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 7 (శుక్రవారం): చాప్చర్ కుట్ - మిజోరంలో బ్యాంకులు మూసివేయబడతాయి.
మార్చి 8 (రెండవ శనివారం) - వారాంతపు సెలవు
మార్చి 9 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 13 (గురువారం): హోలికా దహన్, అట్టుకల్ పొంగల్ - ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కేరళలో బ్యాంకులు మూసివేత.
మార్చి 14 (శుక్రవారం): హోలీ (ధూలేటి/ధులంది/డోల్ జాత్రా) - త్రిపుర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర ేరాష్ట్రాల్లో సెలవు.
మార్చి 15 (శనివారం): ఎంపిక చేసిన రాష్ట్రాల్లో హోలీ - అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులు మూసివేత.
మార్చి 16 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 22 (నాల్గవ శనివారం): వారాంతపు సెలవు, బీహార్ దివాస్
మార్చి 23 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 27 (గురువారం): షబ్-ఎ-ఖాదర్ - జమ్మూలో బ్యాంకులకు సెలవు.
మార్చి 28 (శుక్రవారం): జుమాత్-ఉల్-విదా - జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 30 (ఆదివారం) - వారాంతపు సెలవు
మార్చి 31 (సోమవారం): రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) (షావల్-1)/ఖుతుబ్-ఎ-రంజాన్ - మిజోరాం, హిమాచల్ ప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు.
పై జాబితా ప్రకారం మీ బ్యాంకు సంబంధిత పనిని తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. అయితే, బ్యాంకులు సెలవు రోజుల్లో మూసివేసినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI వంటి సౌకర్యాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
Read Also : Actor Vadivelu: 200కుపైగా స్థానాల్లో డీఎంకే విజయం తథ్యం..
Afghanistan: ఇంగ్లండ్‌పై ఆఫ్ఘాన్ ఆశలు.. సెమీస్ చేరాలంటే సంచలనం జరగాలి
మీకు డయాబెటిస్ ఉందా.. ఈ ప్రత్యేక విషయాలపై జాగ్రత్త వహించండి..