BSNL Recharge Plan: రూ.400లోపే BSNL అదిరిపోయే 4G ప్లాన్.. ఇక 150 రోజుల వరకూ రీఛార్జ్ భయం లేదు..
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:31 PM
BSNL New 4G Recharge Plan: కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు వరస రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తోంది ప్రభుత్వ టెలికాంసంస్థ బీఎస్ఎన్‌ఎల్. జియో, ఎయిర్‌టెల్, వీఐలకు ధీటుగా త్వరలోనే 5జీ నెట్‌వర్క్ ప్రారంభించబోతున్న BSNL తాజాగా కేవలం రూ.3ల కంటే తక్కువ ఖర్చుతో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది.

BSNL Rs 400 Recharge Plan: ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ BSNL సరసమైన ధరలకే రీఛార్జ్ ప్లాన్లు తీసుకొస్తూ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ఛాలెంజ్ విసురుతోంది. ఇప్పటికే 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చి దేశంలోని వివిధ ప్రాంతాల్లో 60 వేలకు పైగా 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. నెట్‌వర్క్‌ను దూకుడుగా అప్‌గ్రేడ్ చేస్తూ జూన్ 2025 నాటికి తన 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న BSNL.. అంతకుముందే చౌక ధరకే రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా, కేవలం రూ.400 లకే 150 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే సరికొత్త 4G ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
BSNL రూ. 397 ప్లాన్ వివరాలు :
BSNL కేవలం రూ.397 లకే బడ్జెట్-ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ పొందినవారు 150 రోజులపాటు రీఛార్జ్ భయం లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు.
మొదటి 30 రోజులు దేశంలో ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
150 రోజుల పాటు ఉచిత జాతీయ రోమింగ్
మొదటి 30 రోజులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా (మొత్తం 60GB)
తొలి 30 రోజులు రోజుకు 100 ఉచిత SMSలు
ప్రారంభ 30 రోజుల వ్యవధి తర్వాత కూడా ఈ నంబర్ 150 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. నిరంతర ఇన్‌కమింగ్ కాల్ సేవలు పొందవచ్చు. కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా ఎక్స్ ట్రా కాలింగ్ సదుపాయం కోసం రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : 8th Pay Commission: ఈసారి ఉద్యోగుల శాలరీ ఎంత పెరగనుందంటే..
Global Startup Ecosystem: స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఇండియా ఎక్కడ..దేశంలో ఈ నగరమే టాప్..
Share Market closing bell: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు