Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
ABN , Publish Date - Jan 27 , 2025 | 12:21 PM
పార్లమెంట్ బడ్జెట్ 2025 సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే బడ్జెట్ చరిత్రను చూస్తే ఆర్థిక మంత్రులే కాదు, ప్రధాన మంత్రులు కూడా బడ్జె్ట్ ప్రవేశపెట్టారు. అది ఎప్పుడెప్పుడనేది ఇక్కడ తెలుసుకుందాం.

కేంద్ర బడ్జెట్ 2025ను (Union Budget 2025) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో మోదీ 3.0 పాలనలో మిగిలిన కాలంలో ముఖ్యమైన ఆర్థిక ప్రకటనలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది. భారతదేశ బడ్జెట్ చరిత్రను చూస్తే అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయని చెప్పవచ్చు. వాటిలో ముఖ్యంగా ఆర్థిక మంత్రులు మాత్రమే కాకుండా, ప్రధానమంత్రులు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏ కీలక సందర్భాలలో ప్రధానమంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రుల జాబితా
1. జవహర్‌లాల్ నెహ్రూ
భారతదేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూ 1958లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధానమంత్రిగా నిలిచారు. ఈ సంవత్సరంలో ముంద్రా కుంభకోణం నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ క్రమంలో నెహ్రూ స్వయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించి, 1958లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.
2. మొరార్జీ దేశాయ్
మొరార్జీ దేశాయ్ 1977 నుంచి 1979 వరకు భారతదేశంలో జనతా పార్టీతో ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన కేవలం ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డ్ కలిగి ఉన్నారు. మొత్తం 10 బడ్జెట్లతో ఆయన రికార్డు సృష్టించారు. ఇందులో 8 వార్షిక బడ్జెట్లు, 2 తాత్కాలిక బడ్జెట్లు ఉన్నాయి. 1959 నుంచి 1963 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన, 1962లో తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించారు.
3. ఇందిరా గాంధీ
భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ 1969లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ సంవత్సరం, మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తర్వాత, ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించి ఆమె 1970లో బడ్జెట్‌ను సమర్పించారు.
4. రాజీవ్ గాంధీ
భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1987లో, అప్పటి ఆర్థిక మంత్రి వి. పి. సింగ్‌ను పదవి నుంచి తొలగించిన తర్వాత కొంతకాలం ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు. ఆ సమయంలో, ఆయన కొన్ని కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు.
5. మన్మోహన్ సింగ్
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు పి.వి. నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన సమర్పించిన 1991 బడ్జెట్ భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు మలుపు అని చెప్పవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది. 1994లో ఆయన సమర్పించిన బడ్జెట్‌లో సేవా పన్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం ఇది ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ఇలా ప్రధానమంత్రులు, కేవలం దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేయడం మాత్రమే కాకుండా, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలతో దేశం ప్రగతిని ప్రేరేపించారు.
ఇవి కూడా చదవండి:
Stock Markets: స్టాక్ మార్కెట్లలో మళ్లీ క్షీణత.. మదుపర్లకు భారీ నష్టాలు
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News