Edible Oil: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:42 AM
ప్రస్తుతం వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. కానీ తాజాగా వీటి ఉత్పత్తుల ధరలు మాత్రం కనీస మద్దతు రేటు కంటే తక్కువకు అమ్ముతున్నారు. ఈ క్రమంలో వీటి రేట్లు త్వరలో తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గుడ్ న్యూస్! వంట నూనె ధరలు (EdibleOilPrices) తగ్గనున్నాయోచ్. అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది. ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం. విదేశీ మార్కెట్లలో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజల ధరలు తగ్గిపోయాయి. శుక్రవారం, దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి. కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డీగమ్ ఆయిల్‌ను దిగుమతి ఖర్చు కంటే 4-5 శాతం తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇది నిధుల సమస్యల కారణంగా జరుగుతుందని చెబుతున్నారు.
తగ్గిన ధరలు..
సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,892గా ఉంది. కానీ స్పాట్ మార్కెట్‌లో ఈ ధర 15-18 శాతం తక్కువగా, అంటే క్వింటాలుకు దాదాపు రూ. 4,000కి సేల్ చేస్తున్నారు. మరోవైపు పొద్దుతిరుగుడు పంట MSP కంటే 20 శాతం తక్కువ ధరకు అమ్ముడవుతోంది. వేరుశనగ పంట కూడా MSP కంటే 22-23 శాతం తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మార్కెట్ డిమాండ్, సరఫరా నియమం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతోందని అంటున్నారు.
వీటి రేట్లు మాత్రం..
మరోవైపు గత మూడు రోజుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి ధరను రూ. 225 పెంచింది. స్పాట్ ధరల్లో బలం ఉన్నప్పటికీ, పత్తి గింజల కేక్ ధరలు గురువారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో దాదాపు అర శాతం తగ్గాయి. నేడు దాదాపు ఒక శాతం తగ్గాయి. హర్యానా, పంజాబ్‌లలో పత్తి విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నందున వీటి ధరలు తగ్గలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగినా, పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు అమ్ముడవుతున్నట్లు కనిపిస్తుంది. ఇది రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనె ధరలు తగ్గుతాయా లేదా అనే ప్రశ్న వస్తుంది.
మరికొన్ని రోజుల్లో
అయితే నూనె గింజల ధరలు తగ్గడం వల్ల, మొదటి దశలో నూనె ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మార్కెట్లో కొనుగోలు, అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుంది. దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో మాత్రం వీటి సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.