Post Office Scheme: వినియోగదారులకు అలెర్ట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌కు ఎండ్‌కార్డ్.. దరఖాస్తుకు కొన్ని రోజులే సమయం..
ABN , Publish Date - Mar 21 , 2025 | 08:18 PM
Post Office Scheme: ప్రజల కోసం పోస్టాఫీసు ఎన్నో రకాల పొదుపు పథకాలు ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి మహిళ ఆర్థిక భద్రత కోసమే ఎన్నో ఉన్నాయి. అందులో ముందువరసలో ఉండే ఈ పథకం త్వరలో క్లోజ్ కాబోతుంది. దరఖాస్తుకు ఇంకొన్ని రోజులే సమయముంది.

Post Office Scheme MSSC: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోస్టాఫీసు కింద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పొదుపు పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ త్వరలోనే ముగింపు దశకు చేరుకుంటోంది. 2023 మార్చి 31న ప్రారంభమైన ఈ పోస్టాఫీస్ స్కీమ్ క్లోజ్ కావడానికి ఇంకొద్ది రోజులే సమయముంది. పొడిగింపు విషయమై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గడువు లోపలే ఆసక్తి ఉన్న మహిళలు పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకం ప్రత్యేకత ఏమిటంటే... దీంట్లో పెట్టుబడి పెడితే తక్కువ కాలవ్యవధిలోనే మెరుగైన వడ్డీ పొందవచ్చు. ప్రభుత్వ గ్యారంటీతో ఉండే స్కీమ్ కావడం వల్ల రిస్క్ లేని పెట్టుబడి. ఏటా 7.5 శాతం వడ్డీ అందించే ఈ పథకం ఇది సాధారణ FDల కన్నా ఎంతో మెరుగైన పెట్టుబడి మార్గం. మహిళలు తమ పెట్టుబడి మొత్తాన్ని పోస్టాఫీసు లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల ద్వారా సులభంగా జమ చేయవచ్చు. ఈ నెల మార్చి 31 లోగా ఈ స్కీంకు దరఖాస్తు చేసుకోండి.
పెట్టుబడి
భారతదేశ పౌరసత్వం ఉన్న ఏ మహిళ అయినా రూ.1,000 నుంచి మొదలుకుని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రెండేళ్ల తరువాత అసలు, వడ్డీ తిరిగి పొందుతారు. అవసరమైతే సంవత్సరం తరువాత పెట్టుబడి మొత్తంలో 40శాతం వరకు తీసుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా అకౌంట్ హోల్డర్ మరణిస్తే ఖాతాను ముందుగానే మూసివేయచ్చు.
అవసరమైన పత్రాలు..
పోస్టాఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో ఈ అకౌంట్ తెరవచ్చు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు, చిరునామా రుజువులు, MSSC అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పిస్తే చాలు.
ఇది మహిళలకు ఆర్థిక భద్రతను కలిగించే సులభమైన మార్గం. సమయం చాలా తక్కువ ఉంది. ఈ నెలాఖరు లోపలే ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ మిస్ అయిపోతారు. ఇప్పుడే ప్లాన్ చేసుకొని భవిష్యత్తుకి బలమైన ఆర్థిక పునాది వేసుకోండి.
Read Also : Bank Strike : కస్టమర్లకు గుడ్ న్యూస్.. నిర్ణయం మార్చుకున్న బ్యాంకు సంఘాలు.. సమ్మె జరిగేది ఎప్పుడంటే..
Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ
UPI New Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి