Rs.23 lakhs: యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటూ ఏకంగా రూ.23 లక్షలు..
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:11 AM
సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగినిని నిండా ముంచేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.23 లక్షలు కొల్లగొట్టారు. దీంతో ఆ రిటైర్డ్ ఉద్యోగిని లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎవరో అనామకుడు బలయ్యాడనుకుంటే ఏమో అనుకోవచ్చు గాని ఏకంగా విద్యావంతలు, ఉద్యోగులే బలవుతుండడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

- రిటైర్డ్ ఉద్యోగినికి బెదిరింపులు రూ.23 లక్షలు కాజేసిన నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిటైర్డ్ ఉద్యోగిని నుంచి సైబర్ కేటుగాళ్లు రూ. 23 లక్షలు కాజేశారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని(65)కి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. మానవ అక్రమ రవాణా, మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి ఆమెపై బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైందని అవతలి వ్యక్తి చెప్పాడు.
ఈ వార్తను కూడా చదవండి: Double-decker flyover: సికింద్రాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు ముందడుగు..
బెంగళూరు(Bengaluru) పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐతో మాట్లాడాలంటూ.. కాల్‌ను అవతలి వ్యక్తికి బదిలీ చేశాడు. ఇటీవల ఓ నేరస్థుడిని పట్టుకున్నామని, అతడిని విచారించగా బాధితురాలికీ ఈ కేసుతో సంబంధం ఉందని నేరస్థుడు చెప్పాడని వివరించాడు. అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని భయపెట్టాడు. తనకు సంబంధం లేదని బాధితురాలు చెప్పినా వినిపించుకోలేదు. ఏదైనా ఉంటే సీనియర్ ఐపీఎస్ అధికారికి చెప్పుకోవాలని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు మరో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఐపీఎస్ అధికారిలా పరిచయం చేసుకున్నాడు. బాధితురాలిపై దేశ ద్రోహం కేసులు నమోదయ్యాయని భయపెట్టాడు.
కేసుల్లోంచి బయటపడాలంటే ఆమె బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఆర్‌బీఐకి చెందిన ఖాతాకు బదిలీ చేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆర్‌బీఐ అధికారులు ఆడిట్ చేస్తారని.. బాధితురాలికి మనీల్యాండరింగ్, మానవ రవాణా లావాదేవీలకు సంబంధం లేదని తేలితే డబ్బు వాపస్ ఇస్తారని వివరించాడు. అదంతా నిజమని నమ్మిన బాధితురాలు రూ. 23 లక్షలను మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు బదిలీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి ఫోన్లు రాకపోవడం, ఫోన్ చేస్తే కేటుగాళ్లు స్పందించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..
Read Latest Telangana News and National News