Share News

Hyderabad: దుబాయి తీసుకెళ్తా.. ఇజ్రాయిల్‌ పంపిస్తా..

ABN , Publish Date - Jan 10 , 2025 | 08:41 AM

‘మంచి ఉద్యోగం.. ఇజ్రాయిల్‌ పంపిస్తా’ అని నమ్మబలికిన ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని దుబాయి తీసుకెళ్లాడు. అక్కడి బ్యాంకుల్లో వారి పేర్లపై పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నాడు. అనంతరం వారిని భయపెట్టి తిరిగి పంపించేశాడు.

Hyderabad: దుబాయి తీసుకెళ్తా.. ఇజ్రాయిల్‌ పంపిస్తా..

- ఉద్యోగాల పేరుతో 80 మందిని మోసం చేసిన గల్ఫ్‌ ఏజెంట్‌

- దుబాయి బ్యాంకుల్లో బాధితుల పేరుతో లోన్లు

- ఈఎంఐ చెల్లించాలంటూ బ్యాంకు అధికారుల ఫోన్లు

- ఆందోళనలో బాధితులు

- ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు

హైదరాబాద్: ‘మంచి ఉద్యోగం.. ఇజ్రాయిల్‌ పంపిస్తా’ అని నమ్మబలికిన ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారిని దుబాయి తీసుకెళ్లాడు. అక్కడి బ్యాంకుల్లో వారి పేర్లపై పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నాడు. అనంతరం వారిని భయపెట్టి తిరిగి పంపించేశాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత లోన్లకు ఈఎంఐలు చెల్లించాలని దుబాయి బ్యాంకు అధికారులు ఫోన్లు చేస్తుండడంతో బాధితులు విస్తుపోయారు. న్యాయం కోసం ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌(Nizamabad)లోని దుండిగుళ్ల భూమేశ్వర్‌ పలు జిల్లాలకు చెందిన వారిని విజిట్‌ వీసాపై గల్ఫ్‌కు తీసుకెళ్లేవాడు.

ఈ వార్తను కూడా చదవండి: Cyber ​​criminals: విద్యార్థినికి రూ.1.30 లక్షలు బురిడీ.. ఏం జరిగిందంటే..


నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 80 మందిని విజిట్‌ వీసాపై దుబాయికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక సబ్‌ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏజెండ్‌ ఒక్కొక్కరి నుంచి రూ. 6 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును భూమేశ్వర్‌కు హవాలా ద్వారా పంపించాడు. కొద్ది నెలలు దుబాయిలో తనకు తెలిసిన వారి కంపెనీలో పని కల్పించి వసతి, భోజనం ఏర్పాట్లు చేశాడు. ఇజ్రాయిల్‌లో మరింత మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి వారితో బ్యాంకు పేపర్లపై సంతకాలు, వేలుముద్రలు తీసుకున్నారు.


కొన్ని నెలల తర్వాత ‘కొన్ని కారణాల వల్ల ఉద్యోగాలు రాలేదు. వెంటనే ఇండియా వెళ్లిపోండి. ఇక్కడ ఉంటే దుబాయి పోలీసులు జైలుకు పంపిస్తారు’ అని బెదిరించి వారు ఇండియా వెళ్లిపోయేలా చేశారు. ఇక్కడకు వచ్చిన తర్వాత బాధితులు భూమేశ్వర్‌కు ఫోన్‌ చేస్తే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి తోడు దుబాయి బ్యాంకు అధికారులు ఫోన్‌ చేసి ‘మీరు తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించండి’ అని చెప్పడంతో విస్తుపోయిన బాధితులు ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో తమకు జరిగిన మోసంపై అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.


city5.2.jpg

సుమారు 30 మంది పేర్లతో దుబాయి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడని, ఒక్కొక్కరి పేర్లపై రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఉన్నట్లు దుబాయి బ్యాంకు అధికారులు ఫోన్లు చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేసిన గల్ఫ్‌ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకుని, రుణవిముక్తులను చేయాలని బాధితులు ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్యలను కలిసి వినతి పత్రం అందజేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 08:41 AM