Share News

Vikarabad: అమ్మమ్మే అమ్మకానికి పెట్టింది..

ABN , Publish Date - Jan 18 , 2025 | 08:11 AM

చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మమ్మే ఏడేళ్ల బాలికను అమ్మకానికి పెట్టిన ఘటన వికారాబాద్‌(Vikarabad) జిల్లాలో కలకలం రేపింది. మర్పల్లి మండలం ఘణాపూర్‌ గ్రామానికి చెందిన యాదమ్మకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Vikarabad: అమ్మమ్మే అమ్మకానికి పెట్టింది..

మర్పల్లి(వికారాబాద్): చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మమ్మే ఏడేళ్ల బాలికను అమ్మకానికి పెట్టిన ఘటన వికారాబాద్‌(Vikarabad) జిల్లాలో కలకలం రేపింది. మర్పల్లి మండలం ఘణాపూర్‌ గ్రామానికి చెందిన యాదమ్మకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో నివాసం ఉండే యాదమ్మ భర్త గతంలోనే చనిపోగా కుమారుడు ఇటీవల మరణించారు. ఓ కుమార్తె సౌందర్యకు బాబు, పాప ఉండగా ఆమెను భర్త వదిలేశాడు. దీంతో సౌందర్య మతిస్థితిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో యాదమ్మ పిల్లలను పెంచింది.

ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: భారత్‌ను విశ్వగురువుగా నిలబెడతాం..


ఈ క్రమంలో యాదమ్మ వద్ద ప్రస్తుతం ఉన్న ఏడేళ్ల పాపను శుక్రవారం అమ్మకానికి పెట్టిందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఐసీడీఎస్‌ సీడీపీవో ప్రవీణకు సమాచారం అందించడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రిజ్వాన(ICDS Supervisor Rizwana), అంగన్‌వాడీ టీచర్‌లు విజయ, పుష్ప గ్రామానికి చేరుకుని పాపను రక్షించి వికారాబాద్‌ శిశు గృహకు తీసుకెళ్లారు. యాదమ్మను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే యాదమ్మకు హైదరాబాద్‌ బొల్లారంతో పాటు ఘణాపూర్‌లో రెండు ఆధార్‌ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 08:11 AM