Share News

Hyderabad: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్‌..

ABN , Publish Date - Jan 14 , 2025 | 07:18 AM

ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని తప్పించుకు తిరుగుతున్న నిత్య పెళ్లికొడుకును జవహర్‌నగర్‌ పోలీసులు(Jawaharnagar Police) సోమవారం అరెస్టు చేశారు.

Hyderabad: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్‌..

- ముగ్గురితో వివాహం

- రెండో భార్య ఫిర్యాదుతో వెలుగులోకి..

హైదరాబాద్: ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని తప్పించుకు తిరుగుతున్న నిత్య పెళ్లికొడుకును జవహర్‌నగర్‌ పోలీసులు(Jawaharnagar Police) సోమవారం అరెస్టు చేశారు. సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గబ్బిబాల్‌పేటకు చెందిన లక్ష్మణరావు(34) ర్యాపిడో బైక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషను పెళ్లి చేసుకున్నాడు. అనూషతో గొడవపడి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తప్పించుకునేందుకు.. గొంతు కోసుకున్న దొంగ


2018లో బాలాజీనగర్‌కు చెందిన లీలావతి(25)తో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. ఆమెను మెదక్‌ చర్చి(Medak Church)లో 2021లో పెళ్లి చేసుకున్నాడు. లీలావతికి 2022లో గాంధీ ఆస్పత్రిలో బాబు పుట్టాడు. బాబును చూడడానికి వచ్చిన లక్ష్మణరావు నేటి వరకు మళ్లీ కనిపించలేదు. ఇటీవల లక్ష్మణరావు శబరి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని మల్కాజిగిరి(Malkajgiri)లో ఉంటున్నాడని తెలుసుకున్న లీలావతి జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మణరావును అరెస్ట్‌ చేశారు.

city2.jpg


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 07:18 AM