Hyderabad: ఫోన్ హ్యాక్ చేసి రూ.2.19 లక్షలు కాజేశారు..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:50 AM
ఎవరో తెలియదు.. ఎక్కడుంటారో తెలియదు.. కానీ రోజూ లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు ఈ సైబర్ కేటుగాళ్లు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క ఫోన్‌కాల్‌తో బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన ఓ మహిళ సైబర్ మోసానికి బలైపోయి రూ.2.19లక్షలు పోగోట్టుకుంది.

హైదరాబాద్ సిటీ: మహిళ ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.2.19లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళ (46) ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. 91449 53236 నంబర్ నుంచి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు తాను ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ‘మీరు వినియోగిస్తున్న క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ (ఇన్సూరెన్స్) గడువు ముగిసింది.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..
రెన్యువల్ చేసుకోవడానికి ఒన్ మొబైల్ యాప్(One Mobile App)ను ఇన్‌స్టాల్ చేసుకొని వివరాలు నమోదు చేయాలి’ అని సూచించాడు. నేరగాడని తెలియని ఆమె అతడు చెప్పినట్లుగా యాప్‌ను ఇన్‌స్టాల్(Install) చేసుకుని వివరాలు నమోదు చేస్తుండగా, మొబైల్‌ను హ్యాక్ చేశాడు. అనంతరం ఆమె క్రెడిట్ కార్డు నుంచి రూ.2.19 లక్షలు కాజేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News