Share News

Cyber ​​criminals: వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట కుచ్చుటోపీ..

ABN , Publish Date - Mar 25 , 2025 | 08:52 AM

నగరంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎక్కడొ ఓ చోట ఈ సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట రూ.5.67 లక్షలు కొల్లగొట్టారు. ప్రతిరోజూ ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

Cyber ​​criminals: వర్క్‌ఫ్రం హోం జాబ్‌ పేరిట కుచ్చుటోపీ..

- రూ.5.67 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ప్రముఖ సంస్థలో వర్క్‌ఫ్రం హోం ఉద్యోగం(Work from home job) ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పిన ఓ సైబర్‌ నేరగాడు() నగరవాసి నుంచి రూ.5.67 లక్షలు కాజేశాడు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి (42)కి సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేసి తాను విప్రో సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. మా సంస్థలో వర్క్‌ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వివరాలు సేకరించాడు. కొరియర్‌(Courier) ద్వారా పలు పత్రాలు పంపి సంతకాలు తీసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: SLBC.. మరో మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ టీమ్‌


city4.2.jpg

తర్వాత రీఫండబుల్‌ అమౌంట్‌ అంటూ పలు దఫాలుగా రూ.5.67 లక్షలు వసూలు చేశాడు. ఆఫర్‌ లెటర్‌ రేపు మాపు అంటూ కాలయాపన చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే నీపై పరువు నష్టం కేసువేస్తానని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం ప్రారంభించాడు. డబ్బులు రాకపోగా బెదిరింపులు ఎదురుకావడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను(Cybercrime police) ఆశ్రయించాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 09:44 AM