Hyderabad: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:15 AM
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన మహ్మద్ దిల్షాద్(21) సోదరుడితో కలిసి చంపాపేట రెడ్డికాలనీ(Champapet Reddykalani)లో నివాసముంటున్నారు.

హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ర్టానికి చెందిన మహ్మద్ దిల్షాద్(21) సోదరుడితో కలిసి చంపాపేట రెడ్డికాలనీ(Champapet Reddykalani)లో నివాసముంటున్నారు. దిల్షాద్ హస్తినాపురంలోని వాణి బోటిక్‌లో, అన్న మహ్మద్ సాదబ్ సైదాబాద్ సరస్వతీనగర్‌లో టైలరింగ్ చేసేవారు. దిల్షాద్ కొంతకాలంగా గ్రామానికి చెందిన ఓ యువతిపై ప్రేమలో పడ్డాడు.
ఈ వార్తను కూడా చదవండి: సెల్లార్ స్లాబ్ పూర్తయ్యే వరకు అనుమతులు లేవని తెలియదట..
ఈ మధ్య ఫోన్‌లో ఇద్దరు గొడవ పడుతుండటం, ఏడ్వడం గమనించిన అన్న అతడిని సముదాయించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి దిల్షాద్(Dilshad) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News