Share News

Sainik School Entrance Exam: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు రేపే లాస్ట్ డేట్.. ఎలా అప్లై చేయాలంటే..

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:17 PM

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025కు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి స్పెషల్ అలర్ట్. ఎందుకంటే వీటికి దరఖాస్తు చేయాలంటే చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. చివరి తేదీ జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Sainik School Entrance Exam: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు రేపే లాస్ట్ డేట్.. ఎలా అప్లై చేయాలంటే..
Sainik Schools Entrance Exam 2025

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 (Sainik School Entrance Exam 2025) కోసం దరఖాస్తు చేసుకునే వారికి అలర్ట్. ఎందుకంటే వీటికి అప్లై చేయాలంటే రేపటి (జనవరి 13న) వరకు మాత్రమే సమయం ఉంది. విద్యార్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ (aissee2025.ntaonline.in) ద్వారా మాత్రమే సమర్పించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) 2025 కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ప్రస్తుతం 6, 9వ తరగతుల కోసం మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ తరగతుల కోసం అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులు అధికారిక లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.


ఆఖరి గడువు: రేపు (జనవరి 13)

జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు AISSEE 2025 కోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విండో సమయం ముగిసిన తర్వాత దరఖాస్తులను నమోదు చేయడం వీలుకాదు. కాబట్టి విద్యార్థులు ఆఖరి క్షణం వరకు వేచి ఉండకుండా తమ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని సూచన.

పరీక్ష తేదీ, మరింత సమాచారం

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష తేదీపై NTA ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఉన్నత పాఠశాలలు, విద్యా సంస్థలు తెలియజేసినట్లుగా 6వ తరగతి కోసం పరీక్ష మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 వరకు, 9వ తరగతి కోసం మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 వరకు నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం, తేదీ, ఇతర వివరాల కోసం AISSEE 2025 అడ్మిట్ కార్డ్‌ని సంబంధిత సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


పరీక్ష రుసుం, అదనపు ఫీజులు?

AISSEE 2025 కోసం దరఖాస్తు రుసుం జనరల్, OBC, EWS అభ్యర్థుల కోసం రూ. 800 ఉండగా, SC/ST అభ్యర్థుల కోసం ఈ రుసుం రూ. 650గా ఉంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీ జనవరి 14, 2025గా ఉంది.

డేటాబేస్ సరిదిద్దుకునేందుకు

దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు జనవరి 16 నుంచి జనవరి 18, 2025 వరకు సమయం ఉంటుంది. అందువల్ల విద్యార్థులు తమ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే, ఈ సమయంలో వాటిని సరిదిద్దుకోవచ్చు.


సైనిక్ స్కూల్ 6వ తరగతి ప్రవేశం అర్హతలు

6వ తరగతిలో ప్రవేశానికి 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు అర్హులు. ఈ క్రమంలో అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

సైనిక్ స్కూల్ 9వ తరగతి ప్రవేశం అర్హతలు

9వ తరగతిలో ప్రవేశానికి, 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు అర్హులు. ఈ తరగతికి సంబంధించిన అభ్యర్థులు 8వ తరగతి పూర్తి చేయాలి.


ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • ముందుగా aissee.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • ఆ తర్వాత రెజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

  • హోమ్‌పేజీలో కనిపించే “AISSEE 2025 కోసం రిజిస్టర్ చేయండి” లింక్‌పై క్లిక్ చేయండి

  • తర్వాత లాగిన్ అయ్యి, దరఖాస్తు ఫారం పూరించండి

  • ఆ క్రమంలో అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి

  • పరీక్ష ఫీజు చెల్లించండి

  • దరఖాస్తును సమర్పించడానికి ముందు ఫీజు చెల్లించి, నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసుకోండి

  • దరఖాస్తు పూర్తైన తర్వాత ప్రింట్‌అవుట్ తీసుకోండి


ఇవి కూడా చదవండి:

Indian Air Force: యువతకు జాబ్ ఆఫర్స్.. ట్రైనింగ్‌లోనే నెలకు రూ. 40 వేలు


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Education News and Latest Telugu News

Updated Date - Jan 12 , 2025 | 03:19 PM