Vitamin B12 Foods : వీటిని రోజూ తింటే.. విటమిన్ B12 లోపం పరార్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:25 PM
Vitamin B12 : అతి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమయ్యే విటమిన్ B12 లోపిస్తే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క సూక్ష్మ పోషకం తగ్గితే శరీరంలో ఉన్న మొత్తం అవయవాల పనితీరు దెబ్బతింటుంది. అయితే, ఈ లోపాన్ని అధిగమించేందుకు విటమిన్ టాబ్లెట్స్ పైన ఆధారపడటం కంటే ఈ కింది ఆహారాలు మీ డైట్ చేసుకుంటే శాశ్వతంగా బి12 సమస్యకు బైబై చెప్పొచ్చు.

Vitamin B12 Foods: రోజూ సరైన సమయానికే తింటున్నా తరచూ అలసట, నీరసం వేధిస్తోందా.. అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు వస్తున్నాయా. అప్పుడప్పుడూ హఠాత్తుగా మతిమరుపు సమస్య కూడా ఎదుర్కొంటున్నారా. అయితే, మీకు విటమిన్ బి 12 తక్కువగా ఉన్నట్లే లెక్క. ఎన్ని వర్కవుట్లు చేసినా రోజూవారీ ఆహారంలో ఈ సూక్ష్మపోషకం ఒక్కటి లోపిస్తే పైన చెప్పినవే కాదు. డయాబెటిస్, రక్తహీనత లాంటి ఎన్నెన్నో సమస్యలు మీ పైన దాడి చేస్తాయి. సాధారణంగా విటమిన్ బి 12 లోపముందని తెలిశాక చాలా మంది చేసే పని టాబ్లెట్లు వేసుకోవడం. వీటి వల్ల తాత్కాలిక పరిష్కారం లభించవచ్చు. కానీ, శాశ్వతంగా B12 సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ ఆహార పదార్థాలు డైలీ తింటే చాలు.
విటమిన్ B12 లోపిస్తే ఏమవుతుంది..
విటమిన్ బి-12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. నీటిలో కరిగే ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల నిర్మాణం, నరాల పనితీరును సక్రమంగా నిర్వహించడంలో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు, DNA ఉత్పత్తికి చాలా అవసరం. ఇది లోపిస్తే ఎర్ర రక్త కణాలు పెద్దవిగా మారతాయి. ఆక్సిజన్‌ను సమర్థవంతంగా తీసుకెళ్లే సామర్థ్యం తగ్గి అలసట, నీరసం వస్తాయి. తద్వారా మెగా లోబ్లాస్టిక్ అనీమియా(రక్త హీనత) సమస్య తలెత్తి బలహీనంగా మారతారు. అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు, మతిమరుపు, డిప్రెషన్, నరాల బలహీనత, డయాబెటిస్ లాంటి ఎన్నో వ్యాధుల బారిన పడతారు.
విటమిన్ బి12 ఎంత అవసరం..
వయసు, ఆరోగ్య స్థితి బట్టి రోజువారీ విటమిన్ బి12 మోతాదు మారుతుంది. పెద్దలకు రోజూ 2.4 మైక్రోగ్రాములు (mcg), గర్భిణీ స్త్రీలకు 2.6 mcg, పాలిచ్చే తల్లులకు 2.8 mcg అవసరం. ఇది ప్రధానంగా మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. శాకాహారులు కింద ఉన్న పదార్థాలను తీసుకుంటే సప్లిమెంట్ల అవసరం లేకుండా సహజంగానే బి 12 విటమిన్ పొందవచ్చు.
గుడ్లు
గుడ్లలోని పచ్చసొనలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. పూర్తి గుడ్డును తింటే బి12 సమస్య తగ్గుతుంది. ఒక పెద్ద గుడ్డులో 0.6 ఎంసిజి విటమిన్ బి12 ఉంటుంది. మీ రోజువారీ అవసరాలలో 25% గుడ్డు ద్వారా పొందవచ్చు. అందిస్తుంది.
పాలు
రోజూ ఒక గ్లాసు పాలు తాగితే దాదాపు 1.2-1.4 mcg విటమిన్ B12 శరీరానికి వస్తుంది. పాలు నచ్చకపోతే ప్రత్యమ్నాయంగా సోయా పాలు తాగవచ్చు.
పెరుగు
విటమిన్-12 పుష్కలంగా దొరికే వాటిల్లో పెరుగు ఒకటి. రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి 28శాతం విటమిన్-12 అందుతుంది.
ఈస్ట్
పోషకాలున్న ఈస్ట్ ఒక చెంచాడు తీసుకుంటే అందులో 5 ఎమ్‌మైక్రోగ్రాములు విటమిన్-12 ఉంటుంది. దీన్ని పాప్‌కార్న్,సూపులు, పాస్తాలలో కలుపుకుని తీసుకోవచ్చు.
సోయా పన్నీర్
సోయా పాలతో టోపులు చేయడం గురించి విన్నారా. బీన్ పెరుగు అని కూడా అంటుంటారు. ఎంతో రుచిగా ఉండే దీన్ని అన్నం, చపాతీ, సలాడ్లు లేదా నూనెలో వేయించుకుని అయినా తినొచ్చు.
తృణధాన్యాలు
తృణధాన్యాలతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి.ఉదయం అల్పాహారంగా ఒక కప్పు తృణధాన్యాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే విటమిన్-12 లోపానికి టాటా చెప్పేయొచ్చు. ఓట్స్ ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్ వీటిలో కొన్ని రకాలు.
ఇంకా చీజ్, అరటిపండు, బీట్‌రూట్, బంగాళాదుంప, యాపిల్, బ్లూ బెర్రీస్, నారింజ, షీటేక్ మష్రూమ్స్, సాల్మన్ చేపలు, ట్యూనా చేపలు, చికెన్ బ్రెస్ట్, యోగర్ట్, రొయ్యలు, టర్కీ కోడి మాంసంలో విటమిన్ బి 12 కు ప్రధాన ఆహార వనరులు. ఈ ఆహార పదార్థాలు తరచూ తింటే విటమిన్ బి 12 సమస్య రమ్మన్నా రాదు.
Read Also : Ice cream: ఐస్‌క్రీం తిన్న తర్వాత ఇవి తింటే.. ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే..
Sunscreen Buying Tips: చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలా.. అవసరం లేదా..
Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న