Headache relief: టీ లేదా కాఫీ తాగితే నిజంగా తలనొప్పి తగ్గిపోతుందా.. ప్రతిసారీ ఇదే అలవాటు కొనసాగిస్తే..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:51 PM
Tea or coffee for Headache relief: ఒక్కోసారి అనుకోకుండా భరించలేనంత తలనొప్పి వస్తుంది. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే గానీ ఈ నొప్పి పోదని చాలామంది అనడం వినే ఉంటారు. ఇంతకీ, ఇలా చేస్తే నిజంగానే తలనొప్పి తగ్గిపోతుందా.. డాక్టర్లు ఏమంటున్నారు..

Tea or coffee for Headache relief: తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు.కొన్నిసార్లు అకస్మాత్తుగా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఇది భరించలేనంతగా స్థాయికి చేరితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తలనొప్పి తీవ్రతను తట్టుకోలేనప్పుడు కొందరు మందులను వేసుకుంటే.. మరికొందరు ఈ అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతారు. కానీ ఈ రకమైన అలవాటు నిజంగా తలనొప్పిని తగ్గిస్తుందా? ఈ అభిప్రాయంలో నిజమెంత? టీ లేదా కాఫీ మొదటి సిప్ మనకు రిలాక్స్‌గా అనిపిస్తుందా? దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
టీ లేదా కాఫీ నిజంగా తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయా లేదా నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయా అనే ప్రశ్నలకు పోషకాహార నిపుణులు సమాధానం ఇదే. తలనొప్పి వచ్చినపుడు టీ లేదా కాఫీ తాగితే అందులోని కెఫిన్ రక్త నాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం దక్కుతుంది. కానీ దీర్ఘకాలంలో ఈ అలవాటు తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుందని వారు అంటున్నారు.
కెఫీన్ వల్ల డీహైడ్రేషన్..
తలనొప్పి సాధారణంగా డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. ఒత్తిడి, ఆందోళన, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సంభవించవచ్చు. టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీర పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఎందుకంటే కెఫిన్ కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. మీరు తక్షణ శక్తి, ఉపశమనం లాంటి అనుభూతి పొందినప్పటికీ తలనొప్పి పదేపదే అటాక్ చేస్తుంది.
తలనొప్పి తగ్గడానికి చిట్కాలు..
సాధారణంగా తలనొప్పిని నివారించడానికి టీ లేదా కాఫీని ప్రత్యామ్నాయంగా తీసుకునే బదులు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం గురించి ఆలోచించండి. శరీరానికి పుష్కలంగా నీరు లేదా ఇతర హైడ్రేటింగ్ ఆహారాలు అందేలా చూసుకోండి. టీ, కాఫీలకు బదులు అల్లం టీ, గ్రీన్ టీ లేదా జ్యూస్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు త్రాగండి. అలాగే, ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్క కూడా తలనొప్పి లక్షణాల నుండి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ నొప్పి భరించలేనంతగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
రోజుకు ఎంత టీ లేదా కాఫీ తాగాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్దలకు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ (సుమారు 4 కప్పుల కాఫీ లేదా 8 కప్పుల టీ) సురక్షితం. అయితే, మీరు తరచుగా తలనొప్పిని ఎదుర్కొంటుంటూ.. వాటి నుండి ఉపశమనం పొందడానికి టీ లేదా కాఫీ వైపు మొగ్గు చూపుతుంటే కెఫిన్ మోతాదును తగ్గించడం మంచిది. ఎందుకంటే, కెఫీన్ త్వరగా ఉపశమనం కలిగించినా దానిపై అతిగా ఆధారపడటం మంచిది కాదు. తలనొప్పిని నయం చేసుకోవడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
Read Also: Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..
Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..
Health Numbers : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఆరోగ్య సంఖ్యలు ఇవే..