Copper VS Steel Water Bottle: రాగి వాటర్ బాటిల్ VS స్టీల్ వాటర్ బాటిల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:29 PM
Copper VS Steel Water Bottle: ప్రతి ఒక్కరూ నీటిని తాగడానికి ప్లాస్టిక్, స్టీల్, రాగి ఇలా రకరకాల బాటిళ్లను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం హానికరం అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా రాగి వాటర్ బాటిళ్లనే వాడుతున్నారు. ఈ రెండు రకాల బాటిళ్లలో ఏది మంచిది? ఎందుకు అనే విషయాలపై పూర్తి సమాచారం మీకోసం..

Copper VS Steel Water Bottle: స్కూలు పిల్లలు, విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు, బయటకు వెళ్లిన సమయాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీళ్ల బాటిళ్లను తమ వెంట తీసుకెళతారు. కానీ, ఆరోగ్యంగా ఉండేందుకు నీరు ఎంత అవసరమో.. ఆ నీటిని ఎందులో నిల్వ చేసుకుని తాగుతున్నారనేది అంతే ముఖ్యం. ఈ విషయంపై ఈ మధ్యప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. అందుకే చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా రాగి బాటిళ్లను వాడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి, ఈ రెండు రకాల్లో ఏది ఆరోగ్యానికి బెస్ట్..
స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్
స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిల్లో నీరు తాగడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు దక్కకపోవచ్చు. కానీ, చాలా కాలం మన్నుతుంది. నీటిని ప్రమాదకరమైన రసాయనాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. తుప్పు పట్టే సమస్య కూడా ఉండదు. అలాగే స్టీల్ నీటి రుచిని ప్రభావితం చేయదు. అదీగాక వీటిని శుభ్రం చేయడం చాలా తేలిక. దుర్వాసన సమస్యలు ఉండవు. ఈ బాటిళ్లను 100 శాతం రీసైకిల్ చేయవచ్చు కాబట్టి పర్యావరణానికీ ఎలాంటి హాని ఉండదు. కాకపోతే, స్టీల్ వాటర్ బాటిళ్లపై డిజైన్లు లేదా కలర్లు ఉంటే అవి కొద్దిరోజులకే తొలగిపోయే అవకాశముంది.
రాగి వాటర్ బాటిల్
రాగికి యాంటీమైక్రోబయల్ గుణాలున్నాయి. ఈ సీసాల్లో నీరు తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, జీర్ణక్రియకు మంచిదని పెద్దలు చెబుతారు. కానీ, ఈ బాటిళ్లలో మనం నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు వేస్తే ఆక్సిడైజేషన్ జరిగి వాటి రుచి, రంగు మారే ప్రమాదముంది. అందుకే నీరు తప్ప ఆమ్ల గుణం ఉన్న ఏ డ్రింక్స్ కూడా కాపర్ బాటిళ్లలో తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాగి బాటిళ్లను సరిగా శుభ్రపరచకపోయినా ప్రమాదమే. రంగు మారకుండా నిత్యం ఉప్పు, నిమ్మ, చింతపండు లేదా వెనిగర్ వంటి పదార్థాలతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా పైన కోటింగ్ వదిలేలా రుద్దకూడదు. కానీ, థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ సీసాలో నీరు నిల్వ చేసుకునే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
Read Also : Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి
Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..