Ice cream: ఐస్‌క్రీం తిన్న తర్వాత ఇవి తింటే.. ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:25 PM
Ice cream: ఐస్‌క్రీం పేరెత్తితేనే నోరూరిపోతుంది చాలామందికి. ఏ సీజన్లో అయినా ఐస్ క్రీం ఇష్టంగా లాగించేవాళ్లు ఎండాకాలం వచ్చిందంటే అస్సలు ఊరుకోరు. అదేపనిగా తింటూ ఉంటారు. అయితే, ఐస్ క్రీం తిన్న వెంటనే మీకు తెలియకుండా చేసే ఈ చిన్న తప్పులు మీ ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తాయో ఊహించలేరు.

Ice cream Side Effects : వేసవిలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినే ఫుడ్ ఐటెమ్స్‌లో ఐస్ క్రీం తప్పనిసరిగా ఉంటుంది. మండే ఎండల్లో చల్లచల్లని ఐస్ క్రీం గొంతులోకి దిగుతుంటే వచ్చే అనుభూతే వేరంటారు ఐస్ క్రీం ప్రియులు. దాహం అనిపించినా, గొంతు ఎండుకుపోయిన భావన కలిగినా ఐస్ క్రీం తినేందుకు సై అంటారు. గతంలోలాగా కాకుండా వందల రకాల వెరైటీలు, ఫ్లేవర్లు వీరిని మరింత ఊరిస్తాయి. అతి అనర్థదాయకం అంటారు పెద్దలు. ఇదిలా ఉంచితే ఐస్ క్రీం తిన్న వెంటనే ఈ పదార్థాలు తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టిముట్టి మీరే ఇబ్బందిపడతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీం తినగానే ఈ పొరపాట్లు చేయకండి.
వేడి వేడిగా తింటే:
చల్లచల్లగా ఉన్న ఐస్ క్రీం తిన్న వెంటనే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వేడి వేడిగా ఆహారం తినేస్తున్నారా. ఇలా చేస్తే మీ జీర్ణ వ్యవస్థ అల్లకల్లోలం అయిపోతుంది. అజీర్తి, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
సిట్రస్ పండ్లు :
నారింజ, ద్రాక్ష, అనాస, బత్తాయి వంటి సిట్రస్ అధికంగా ఉండే పండ్లు, లాక్టోస్ శాతం ఎక్కువగా ఉంటే పాలు ఐస్ క్రీం తిన్నాక ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
నీళ్లు:
ఐస్ క్రీం తిన్న వెంటనే కొందరికి వెంటనే జలుబు పట్టేస్తుంది. అప్పుడప్పుడూ దగ్గుతో కూడా బాధపడతారు. ఈ సమస్యలు ఐస్ క్రీం తినడం వల్లే వచ్చాయని భ్రమపడుతున్నారేమో. కానే కాదు. ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లు తాగితే ఇలా జరుగుతుంది.
వ్యాయామం :
ఐస్ క్రీం తిన్న తర్వాత బరువులెత్తడం, వ్యాయామం లాంటి శారీరక శ్రమలు చేయకూడదు. దీనివల్ల కడుపుల్లో ఇబ్బందులు, అసౌకర్యం, జీర్ణ సమస్యలు సంభవిస్తాయి.
బ్రషింగ్ :
డిన్నర్ పూర్తి కాగానే బ్రష్ చేస్తుంటాం. ఐస్ క్రీం తినగానే బ్రష్ చేస్తే దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది.
వేడి సూప్:
ఐస్ క్రీం తిన్న తర్వాత వేడి సూప్ తాగితే జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి
పెరుగు :
ఐస్ క్రీం తయారీ పాలను వాడతారు. కాబట్టి మీరు ఐస్ క్రీం తిన్న వెంటనే పెరుగు తింటే జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది.
టీ లేదా కాఫీ :
ఐస్ క్రీం తినగానే టీ లేదా కాఫీ వంటి డ్రింక్స్ తీసుకోకూడదు. వీటిలో ఉండే కెఫిన్ అప్పుడే కడుపులోకి చేరిన ఐస్ క్రీంతో కలిస్తే కడుపులో అసౌకర్యం తలెత్తుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి.
ఐస్ క్రీం తిన్నాక పాటించాల్సిన 3 జాగ్రత్తలు :
ఐస్ క్రీం తిన్న వెంటనే గోరు వెచ్చగా ఉన్న కొన్ని నీళ్ళు తాగండి.
ఐస్ క్రీం తిన్న తర్వాత ఎండలో ఎక్కవ సమయం ఉండకండి.
అలాగే ఐస్ క్రీం తిన్నాక అరగంట పాటు వేడిగా ఉండే ఆహారాలు, నీళ్లు, పెరుగు, టీ/కాఫీ, వేడి సూప్, సిట్రస్ పండ్లు తీసుకోకండి.
Read Also : Sunscreen Buying Tips: చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలా.. అవసరం లేదా..
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..
Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న