Hyderabad: మహిళకు అరుదైన సర్జరీ
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:24 AM
గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ (52) వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి పునర్జన్మ కల్పించారు. నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతోంది. అయితే.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అరుదైన సర్జరీ నిర్వహించి ప్రాణాపాయం లేకుండా చేశఆరు.
హైదరాబాద్ సిటీ: ఓ మహిళకు అరుదైన సర్జరీ(Surgery) చేశారు ప్రీతి యూరాలజీ ఆస్పత్రి వైద్యులు. గురువారం బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి. చంద్రమోహన్, వైద్యులు వివరాలు వెల్లడించారు. విజయనగర్ కాలనీ(Vijayanagar Colony)కి చెందిన ఓ మహిళ (52) మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతోంది. ప్రధానంగా ఆమెకు కిడ్నీ ఇన్‌ఫెక్షన్, పదే పదే క్రియాటిన్ పెరిగిపోవడం లాంటి సమస్యలున్నాయి. సమస్య తీవ్రతరం కావడంతో ప్రీతి యూరాలజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: Fruit juices: వామ్మో.. పండ్ల రసాలు..

వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు సరిగా లేదని గుర్తించారు. మూత్రనాళాలు పూర్తిగా పాడైపోయాయి. ఆమెకు తొమ్మిదిన్నర గంటలపాటు శ్రమించి 13 కీహోల్ శస్త్రచికిత్స చేశామని తెలిపారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మహిళ లేచి నడవగలుగుతున్నారు. క్రియాటిన్ సాధారణ స్థాయికి చేరుకుందని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు. దేశంలో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని, రెండువైపులా ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సతో మూత్రనాళాలను మార్చిన చరిత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News