Kidney Health: కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తింటే ఏమవుతుంది..
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:21 PM
Jaggery For Kidney Patients: చెరకు నుంచి తయారయ్యే బెల్లం సహజ తీపి పదార్థం. చక్కెరకు బదులుగా బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తరచూ వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవడం హానికరమనే అపోహ ప్రచారంలో ఉంది. ఇది నిజంగా వాస్తవమేనా? కేవలం అభూత కల్పనా?

Jaggery For Kidney Patients: స్వీట్ల తయారీలో, వంటకాల్లో బెల్లం ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. సహజంగా చెరకు నుంచి తీసే ఈ తీపి పదార్థాన్ని ఆరోగ్యంగా ఉన్నవారు ఎంత తింటే అంత మంచిది. బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను నివారణకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు తరచూ బెల్లం తినాలని చెబుతుంటారు పెద్దలు. ప్రతి రోజూ భోజనం తర్వాత ఒక బెల్లం ముక్క జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. మరి, ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగించే బెల్లాన్ని కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినొచ్చా..
బెల్లం ఉపయోగాలు..
బెల్లంలో రెండు రకాలు ఉన్నాయి. చెరకు రసం లేదా తాటి రసంతో వీటిని తయారుచేస్తారు. రసాయన పదార్థాలు వాడకుండానే శుద్ధి చేసిన రసంతో బెల్లం తయారుచేస్తారు. ఇందులోని సహజ చక్కెరలు జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసిన తక్షణ శక్తిని అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు రోగనిరోధకశక్తిని పెంచే యాంటీయాక్సిడెంట్లు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు బెల్లం ఎంతగానో సాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు, పిల్లలు తప్పక తీసుకుంటూ ఉండాలి.
కిడ్నీ ఆరోగ్యానికి బెల్లం మంచిదేనా..
చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు వెళ్లిపోయేలా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బెల్లంలో చక్కెరలో కంటే తీపి అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని అతిగా తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదముంది. ఎందుకంటే షుగర్ ఉన్నవారిలో కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహజ తీపి పదార్థం కదా అని చెప్పి బెల్లం తిన్నారంటే మొదటికే మోసం వస్తుంది. ఇక కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా బెల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులోని పొటాషియం వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అయితే, కిడ్నీ సమస్యల తీవ్రతను బట్టి బెల్లం తినాల్సి ఉంటుంది.
కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు తీసుకున్నా ఏం కాదని వైద్యులు సూచిస్తున్నారు. రసాయనాలు కలపకుండా సహజంగా తయారుచేసిన బెల్లాన్ని తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బెల్లం తీసుకుంటేనే ఉత్తమం.
Read Also: Health Numbers : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన ఆరోగ్య సంఖ్యలు ఇవే..
Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..
Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..