Blood Pressure : బీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన 5 రకాల ఆహారాలు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 06:55 PM
How To Control Blood Pressure : రక్తపోటు ఇప్పుడు అన్ని వయసువాళ్లలో సర్వసాధారణంగా మారింది. ఇది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ప్రమాదమే. దీన్ని అదుపులో ఉంచుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. బీపీ ఉన్నవాళ్లు ఈ 5 రకాల ఆహారాలు తింటే ఏ సమస్యా రాదు.

How To Control Blood Pressure With Food : ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ సమస్యగా మారింది. అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరమైన సమస్య. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఇది మీ గుండెను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. త్వరగా గుండెపోటు వచ్చేలా చేస్తుంది. అందుకే రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడే కొన్ని రకాల ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి.
అధిక రక్తపోటును నియంత్రించే 5 ఆహారాలు (Foods to Control High BP) :
ఆకుకూరలు
పాలకూర, కాలే, మెంతులు, ఆవాలు వంటి వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే వీటిలో మెగ్నీషియం, నైట్రేట్లు కూడా ఉంటాయి ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి.
అరటి
అరటిపండు అన్నిరకాల ఆదాయవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆహారం. దీంట్లో హై బీపీని తగ్గించే పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఒక మధ్య తరహా అరటిపండులో దాదాపు 422 mg పొటాషియం ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీన్ని అల్పాహారంలో లేదా స్మూతీగా తినడం మంచిది.
ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. అందుకే రక్తపోటును తగ్గించగలదు. ఓట్స్‌లోని బీటా-గ్లూకాన్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అల్పాహారంలో ఓట్స్ తినడం ఆరోగ్యకరమని అంటారు వైద్యులు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి తిన్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెరిగి రక్త నాళాలను వెడల్పు అవుతాయి. దీనితో పాటు ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉండటం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
పెరుగు
పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. దీనిలోని కాల్షియం రక్త నాళాలను సరళంగా మార్చి రక్తపోటును నియంత్రించేందుకు సహకరిస్తుంది. ఇక ప్రోబయోటిక్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తాయి. అయితే, తక్కువ వెన్న శాతం ఉన్న పెరుగు తినడం శ్రేయస్కరం.
Read Also : Excess Salt in Food : ఆహారంలో అదనపు ఉప్పు తగ్గించేందుకు.. 5 సులభమైన పద్ధతులు..
Kidney Problem: ఈ తప్పులు చేస్తే కిడ్నీలు చెడిపోవడం ఖాయం.. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉండాలంటే..
Dog Bite - RIG: కుక్క కరిచినప్పుడు టీకా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా..