Matcha Drink Benefits: కాఫీ, చాయ్ బదులు ఇది తాగండి.. మీకు తిరుగే ఉండదు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:02 PM
Matcha Drink Benefits: మట్చా.. పేరు వినడానికి కొత్తగా ఉంది కదూ. ఇండియాలో ఈ డ్రింక్ గురించి అందరికీ తెలియకపోవచ్చేమో గానీ.. జపాన్ దేశంలో ఇది చాలా ఫేమస్. వయసు పెరుగుతున్నా అక్కడి ప్రజలు నాజూగ్గా కనిపించడానికి ఇదే కారణమంట. వందేళ్లకు పైగా జీవించగలిగే శక్తినిచ్చే ఆ డ్రింక్ దేంతో ఏంటని అనుకుంటున్నారా..

Matcha Drink Benefits: 'మట్చా' అనే పేరు వినడానికి కొత్తగా అనిపించినా.. గ్రీన్ టీ ప్రియులకు ఇది బాగా పరిచయమే. షేడ్ గ్రోన్ టీ ఆకులను నీటిలో మరిగించి తాగే గ్రీన్ టీ కంటే 'మట్చా' భిన్నమైన డ్రింక్. పచ్చటి రూపంలో ఉండే పొడిని ఉపయోగించి జపాన్ లో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ మట్చా టీ-ఇప్పుడు మన దేశంలోనూ ఆహార ప్రియుల మదిలో ఇప్పుడిప్పుడే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. తక్కువ క్యాలరీలతో, అధిక పోషకాలతో ఉండే ఈ టీని అతిగా కాకుండా పరిమితంగా తీసుకుంటే.. శరీరానికి అనేక రకాల లాభాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
షార్క్ ట్యాంక్ ఇండియాలో న్యూ స్టార్టప్ మట్చా..
జపాన్ నుంచి ఇండియా వరకు వచ్చిన మట్చా టీ ప్రయాణం ఆసక్తికరంగా. ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియా లో కూడా ఈ టీకి సంబంధించిన స్టార్టప్ ప్రస్తావన రావడమే దీని పాపులారిటీకి నిదర్శనం. మిలియన్ డాలర్ల మార్కెట్‌కు ఉన్న మట్చా టీ భారత్‌లో ఇంకా పరిమిత వర్గాల్లోనే ప్రాచుర్యం పొందుతోంది. అసలు మట్చా టీ తీసుకోవాలా? వద్దా? మన ఇండియన్స్ దినచర్యలో ఈ ఆహారాన్ని చేర్చుకోవడం మంచిదేనా అనే ప్రశ్నలు చాలామందిలో కలుగుతున్నాయి.
కాఫీ, టీకి ప్రత్యమ్నాయంగా మట్చా?
రానున్న రోజుల్లో మట్చా టీ కాఫీ, చాయ్ కి ప్రత్యామ్నాయంగా మారుతుందా? అంటే అవుననే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎండిన ఆకులను పూర్తిగా మిక్స్ చేసి తాగే మట్చా టీ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా EGCG అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. దీని వల్ల మెటబాలిజం మెరుగవుతుంది, శరీరంలో శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తక్కువ కెఫిన్ ఉంటుంది. ఇందులోని ల్-థియానిన్ అనే పదార్ధం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. ఎన్ని పోషక విలువలు ఉన్నప్పటికీ ధర మాత్రం ప్రియంగానే ఉంది. గ్రాముల మంచి నాణ్యత కలిగిన మట్చా టీ పొడికి రూ.2,000 – 3,000 వరకూ ఖర్చవుతుంది. అంతేగాక, మితిమీరిన వినియోగం వల్ల జీర్ణ సమస్యలు, లో బీపీ బాధితులు ఇబ్బందిపడే అవకాశం కూడా ఉంది. తక్కువ నాణ్యత కలిగిన మట్చాలో మెటల్స్ ఉండే ప్రమాదం కూడా ఉంటుందట. భారతదేశంలో లభించే అశ్వగంధ, తులసీ, అల్లం, మిరియాలు, వాము, పుదీనా, హల్దీ లాంటి అనేక ఆయుర్వేద మూలికలతో తయారయ్యే ఇండియన్ హెర్బల్ టీలు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆరోగ్యం కలిగించే ఈ పానీయాలే బెటర్ ఆప్షన్లని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Summer Tips: స్టైలిష్ లుక్ కోసం వేసవిలోనూ బూట్లు ధరిస్తున్నారా.. ఇలా చేస్తే పాదాలు..Ice Creams: ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..
Weight Loss: రెండున్నరేళ్లలో 150 నుంచి 75 కేజీలకు