Share News

Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:22 PM

How to Avoid Alcohol : ఆల్కహాల్ తాగడానికి ఒకసారి అలవాటు పడితే మానటం అంత సులువు కాదు. పరిస్థితులు మానేయాలని చెబుతున్నా మనసు అటువైపే లాగుతుంది. మద్యం మానాలని మీరు ప్రయత్నిస్తుంటే డీ అడిక్షన్ సెంటర్‌కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది.

Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ  ఒక్క డ్రింక్ చాలు..
How to Stop Drinking Alcohol

How to Avoid Alcohol : మద్యం విషానికంటే తక్కువ కాదు. ఇది స్లో పాయిజన్ లాంటిది. ఒక్కసారి ఇది శరీరంలోకి వెళితే దీని ప్రభావం వారం రోజుల వరకూ ఉంటుంది. ఈ ఒక్క అలవాటు మీ ఆయుష్షును తినేస్తుంది. ఆర్థిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది. మీ శరీరాన్ని రోగాలకు నిలయం చేసే ఈ దురలవాటును తక్షణమే మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీరు డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద చెప్పిన విధంగా ఈ ఒక్క డ్రింక్ ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే చాలు. మద్యం జోలికి వెళ్లాలని ఎప్పుడూ అనిపించదు.


రోజూ మద్యం తాగితే ఏమవుతుంది..

ఆల్కహాల్ విషపూరితమైనది. మీ శరీరాన్ని ధ్వంసం చేస్తుంది. ఎలా అంటే, దీన్ని ఒకసారి తీసుకుంటే దాని ప్రభావం మీ శరీరంపై వారం రోజుల వరకూ పోదు. ఇది క్రమంగా మీ జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తూ వస్తుంది. పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఎనర్జీ లెవెల్స్ తగ్గిస్తుంది. దీనివల్ల ప్రధానంగా నాశనమయ్యే అవయవం కాలేయం. లివర్‌ మన శరీరంలో ఫిల్టరింగ్ ఫ్యాక్టరీ లాంటిది. జీర్ణక్రియలు సక్రమంగా జరగడంలో దీనిదే ముఖ్య పాత్ర. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో ఈ ప్రక్రియ గతి తప్పుతుంది. మద్యం కడుపులోకి వెళ్లినపుడు కాలేయం ఇతరత్రా శరీర విధులను ఆపేసి దీనినే జీర్ణం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంటే దీని ప్రభావం శరీరంపై ఎంతలా ఉంటుదో అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మద్యం సేవించేవారి వయసు 20 కావచ్చు. 80 కావచ్చు. ఎఫెక్ట్ మాత్రం ఒకేలాగే ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


ఆల్కహాల్ ఎలా మానాలి..

పార్టీలు లేదా ఫంక్షన్లకు వెళ్లినపుడు ఫ్రెండ్స్‌, కొలీగ్స్, బంధువులు బలవంతం చేసినా కొందరు ఆల్కహాల్‌ ముట్టుకోరు. బదులుగా మాక్‌టెయిల్ తాగుతుంటారు. అయితే మద్యం అలవాటు ఉండి దూరంగా ఉండాలనుకునేవారు కళ్లెదుట ఆల్కహాల్ కనిపిస్తుంటే ఆగలేరు. ఈ టెప్టింగ్ ఫీలింగ్ పోగొట్టుకునేందుకు ఈ సాధారణ చిట్కాను ఫాలో అవండి. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని బిట్టర్ ఫ్లేవర్స్, ఆరెంజ్ స్లైస్ వేసుకుని తాగండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే మద్యం సేవించిన ఫీలింగ్ ఇస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకే తెలుస్తుంది.


Read Also : Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Blood Pressure : బీపీ ఉన్నవాళ్లు తప్పక తినాల్సిన 5 రకాల ఆహారాలు..

Kidney Problem: ఈ తప్పులు చేస్తే కిడ్నీలు చెడిపోవడం ఖాయం.. మీ కిడ్నీని ఆరోగ్యంగా ఉండాలంటే..

Updated Date - Mar 18 , 2025 | 07:34 PM