Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:24 PM
Reduce Obesity Tips: శరీర బరువు పెరగడంతో.. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతోన్నాయి. ఈ కారణంగా .. షుగర్,హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్‌తోపాటు కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. సరైన సమయంలో కచ్చితమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా ఊబకాయాన్ని సులభంగా నియంత్రించ వచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నేడు ప్రతి ఒక్కరిది బిజీ బిజీ జీవితం. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతోపాటు ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు పెరగడం.. శరీర నిర్మాణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతోన్నాయి. ఇంకా చెప్పాలంటే.. షుగర్, హై బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్‌తోపాటు కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. సరైన సమయంలో కచ్చితమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా ఊబకాయాన్ని సులభంగా నియంత్రించ వచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయాన్ని తగ్గించడానికి మీరు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే..
సమతుల్య ఆహారం: బరువు తగ్గడానికి, మీ ఆహారం సమతుల్యంగా ఉండటం చాలా చాలా ముఖ్యం. అంటే మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లతోపాటు ఖనిజాలను తీసుకోవాలి. అలాగే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాల్సి ఉంటుంది. ఇక గుడ్లు, పప్పులు, పాలు, చీజ్, సోయా, గింజలు, చికెన్ తదితర పదార్థాలను తీసుకోవాలి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనితోపాటు అధిక సమయం ఆకలి అనిపించదు. అలాగే ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఓట్స్‌తోపాటు తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరాన్ని మేలు జరుగుతోంది. బరువు తగ్గడానికి శరీరానికి మంచి కొవ్వులు కూడా అవసరం అవుతాయి. అందుకోసం గింజలు..లిన్సీడ్, చియా, అవకాడోతోపాటు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.
ప్రాసెస్ చేసిన వాటితోపాటు జంక్ ఫుడ్‌కు దూరం: మార్కెట్లో లభించే ఫాస్ట్ ఫుడ్, క్యాన్డ్‌తోపాటు ప్రాసెస్ చేసిన ఆహారంలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు, చక్కెర తదితర పదార్థాలు ఉంటాయి, ఇవి బరువును పెంచడంతో పాటు జీవక్రియను నెమ్మది చేసేలా చేస్తాయి.బిస్కెట్లు,బ్రెడ్,నూడుల్స్,చిప్స్‌తోపాటు కూల్ డ్రింక్స్ వంటి వాటిని దూరంగా ఉంచడం మరి ముఖ్యం.
వీటిని సైతం తగ్గించండి: పేస్ట్రీలు, స్వీట్లు, వైట్ బ్రెడ్, పరాఠాలు, నూడుల్స్‌తోపాటు బేకరీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన పిండితో తయారు చేసిన ఆహార పదార్థాల వల్ల వేగంగా బరువు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ఆయా పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటికి బదులు బెల్లం, తేనెతోపాటు మల్టీ గ్రెయిన్ పిండిని ఉపయోగించడం వల్ల మేలు చేకూరుతోంది.
అధికంగా నీరు తాగాలి: ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగాలి. అందుకోసం గోరు వెచ్చనీ నీరు, నిమ్మరసం తీసుకోవడం వల్ల జీవక్రియను వేగవంత చేయడమే కాకుండా.. బొడ్డు కొవ్వును సైతం తగ్గిస్తుంది.
కొద్ది కొద్దిగా భోజనం చేయండి: అంటే రోజుకు మధ్యాహ్నం, రాత్రి.. రెండు సార్లు భోజనం చేయడానికి బదులు.. రోజులో వివిధ సందర్భాల్లో 4 నుంచి 5 సార్లు కొద్ది కొద్దిగా భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతోంది. ఈ విధంగా ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇక టిఫిన్ చేయడం మాత్రం మానివేయ వద్దు. టిఫిన్ తీసుకోవడం వల్ల.. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతోంది.
క్రమం తప్పకుండా వ్యాయామం: ఆహారంతో పాటు,బరువు తగ్గడానికి వ్యాయామం కూడా ముఖ్యం.యోగా, చురుకైన నడక,పరుగు,ఈత,సైక్లింగ్ వల్ల శరీరంలో అదనపు కేలరీలను బర్న్ చేస్తాయి. ఇది బరువును త్వరగా తగ్గిస్తుంది.
తగినంత నిద్ర: తగినంత నిద్ పోక పోవడం వల్ల హార్మోన్లలో అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. తద్వారా వేగంగా బరువు పెరగడానికి దారి తీస్తుంది.అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది.
తక్కువ తినడం: ఊబకాయాన్ని తగ్గించడం కోసం సరైన ఆహారం తీసుకోవడం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం మరి ముఖ్యం. ఊబకాయాన్ని తగ్గించే క్రమంలో.. ఒక్కసారిగా తక్కువ తినడం ప్రారంభిస్తే.. అది శరీరాన్ని బలహీన పరుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా ఓపికగా.. క్రమశిక్షణతో మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంది.
Read Also : Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది
Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న చిట్కాతో మీ ముఖం ఎంతలా మెరిసిపోతుందో నమ్మలేరు.
Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..
Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..
Vitamin B12 Deficiency: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త