Weight Loss : 9 నెలల్లోనే 32 కిలోలు తగ్గిన మహిళ.. ఇవి తినడం వల్లే అంట..
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:52 PM
ఈ 3 ఆహార పదార్థాల సాయంతో ఒక మహిళ కేవలం 9 నెలల్లోనే 32 కిలోల బరువు తగ్గించుకుంది. తన వెయిట్ లాస్ జర్నీపై ఆమె పోస్ట్ చేసిన రీల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ రహస్యమేంటో మీరూ తెలుసుకోండి.

నేటి తరాన్ని వేధించే అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఊబకాయం. ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ లేకపోవడం, ఆరోగ్య పరిరక్షణకు తగినంత సమయం కేటాయించపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజుల్లో ప్రజలు వేగంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. ఒకసారి ఈ అధిక బరువు పెరిగారంటే అది కరిగించుకోవటం అంత తేలిక కాదు. కానీ కొంతమంది ఇది ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. అవిశ్రాంతంగా కృషి చేసి అనుకున్న సమయానికి బరువు తగ్గి చూపిస్తారు. ఇలాంటి కోవకే చెందిన ఓ మహిళ అద్భుతమైన ఫీట్ చేసిందనే చెప్పాలి. 97 కిలోల బరువున్న ఆమె జస్ట్ 9 నెలల్లోనే 32 కిలోల బరువు తగ్గించుకుని ఫిట్‌గా, నాజూగ్గా తయారైంది. తన వెయిట్ లాస్ జర్నీపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వారెవ్వా అనిపిస్తోంది. ఆ రహస్యమేంటో మీకూ తెలుసుకోవాలనుంటే ఈ స్టోరీ చదివేయండి..
97 కిలోల బరువుతో సొంత పనులే చేసుకోలేక ఇబ్బందిపడేది అమీ మేయర్. లావుగా ఉన్న పాపానికి ఎన్నో అవమానాలూ భరించింది. నలుగురిలో అడుగుపెట్టాలంటే భయపడేది. అలాంటి స్థితి ఇంకెప్పటికీ రాకూడదని ఒక రోజు నిర్ణయించుకున్న తర్వాత తన వెయిట్ లాస్ జర్మీ స్టార్ట్ చేసింది. పక్కా డైట్ ప్లాన్ రూపొందించుకుని కేవలం 9 నెలల్లోనే 32 కిలోల బరువు కరిగించుకుంది. చాలా వేగంగా 66 కిలోలకు వెయిట్ మారి చూపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ 3 పదార్థాలే తన బరువు తొలగించడంలో కీ రోల్ ప్లే చేశాయని చెబుతోంది. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
గ్రీక్ యోగర్ట్: ఇందులో ప్రొటీన్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చాలాసేపటికి గానీ ఆకలి వేయదు.ఇందులోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. భోజనంలో గ్రీక్ యోగర్ట్ భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి
చియా విత్తనాలు: చియా సీడ్స్ మెక్సికోకు చెందినవి. ఇవి చూసేందుకు సబ్జా లేదా తులసి గింజలనే పోలి ఉంటాయి. ఇందులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. రక్తంలోకి గ్లూకోజ్ విడుదలయ్యే వేగాన్ని తగ్గిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి చిరుతిండి తినాలనే కోరికను అదుపు చేస్తుంది. అదే సమయంలో స్థిరమైన శక్తి కూడా ఇచ్చి బరువు తగ్గించుకునేందుకు తోడ్పడుతుంది.
అవకాడో: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇందులోని ఫైబర్ పై రెండు పదార్థాల మాదిరిగానే జీర్ణక్రియ నెమ్మదించేందుకు, రక్తంలో చక్కెర స్థాయి తగ్గించేందుకు సాయపడుతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గగలుగుతారు.