Sunita Williams:సునీతా విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని.. యజ్ఞం చేసిన గ్రామం..
ABN , Publish Date - Mar 18 , 2025 | 07:47 PM
Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు 9 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. దీంతో గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె పూర్వీకులు ఇంటికి తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Sunita Williams: వారం రోజుల మిషన్ కోసం వెళ్లి అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) 9 నెలల ఎదురు చూపుల తర్వాత స్వదేశానకి తిరుగు ప్రయానమయ్యారు.కొన్ని గంటల్లో సహచర బృందంతో కలిసి భూమిపై కాలుమోపనున్న సునీత రాక కోసం భారతదేశంలో ఉన్న ఆమె పూర్వీకులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆమె తల్లి, సోదరుడు, సోదరి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఆమె రాక కోసం యజ్ఞం చేస్తున్నాం..
ఇన్ని నెలల నిరీక్షణ తర్వాత తమ సోదరి సునీతా విలియమ్స్ ఇంటికి తిరిగొస్తుండటం మహదానందంగా ఉందని గుజరాత్‌లో నివసిస్తున్న ఆమె కజిన్ దినేష్ రావల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "ఆమె తల్లి, సోదరుడు, సోదరి సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆమె ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఆమె తిరిగి రావడం కోసం మేము 'యజ్ఞం' చేస్తున్నాము. స్వదేశానికి వచ్చిన తర్వాత స్వీట్లు పంపిణీ చేసి ఆ సందర్భాన్ని పండగలా జరుపుకుంటాము. సునీతా మన దేశానికి గర్వకారణం" అని అన్నారు.
ఇప్పటికే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్,రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయల్దేరారు. ISS నుంచి క్యాప్సూల్ అన్‌డాకింగ్ ప్రక్రియ దృశ్యాలను నాసా (NASA)యూట్యూబ్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తోంది.
Sunita Williams: రేపు ఈపాటికి భూమికి సునీతా విలియమ్స్!
415 Crore Compensation: నక్కతోక తొక్కాడు.. కాఫీ మీద పడిందని రూ.415 కోట్ల పరిహారం..