Attack: వైమానిక దళ స్థావరంపై దాడి.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:13 PM
ఓ వైమానిక దళ వైమానిక స్థావరంపై సోమవారం దుండగులు దాడి చేశారు. ఆ క్రమంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.

బంగ్లాదేశ్(Bangladesh) కాక్స్ బజార్ నగరంలోని వైమానిక దళ స్థావరంపై ఈరోజు ఆకస్మాత్తుగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR), బంగ్లాదేశ్ ఆర్మీ మీడియా విభాగం తెలిపిన వివరాల ప్రకారం, సమీపంలోని సమితి పారా ప్రాంతంలోని కొంతమంది దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. దాడి సమయంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు 30 ఏళ్ల యువకుడు అయిన షిహాబ్ కబీర్, ఆయన స్థానిక వ్యాపారవేత్తగా గుర్తించారు. ఆయన తుపాకీ గాయాలతో మరణించాడు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డట్లు సమాచారం.
ఈ దాడి ఎవరు చేశారు..
ఈ దాడి నేపథ్యంలో బంగ్లాదేశ్ వైమానిక దళం పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో వైమానిక దళం కూడా దాడులను ఎదుర్కొని కాల్పులు జరిపింది. సైన్యంతోపాటు ఇతర సెక్యూరిటీ బృందాలు ముష్కరులను ఎదుర్కొని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ దాడికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఏ సంస్థ కూడా ప్రకటించలేదు.
గతంలో కూడా దాడులు
అయితే కాక్స్ బజార్ వైమానిక దళ స్థావరంపై జరిగిన ఈ దాడి మొదటిసారి కాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయన్నారు. కానీ తాజాగా జరిగిన ఎటాక్ మాత్రం, మరింత క్రూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని అధికారులు నిర్ణయించుకున్నారు. సైన్యంతో పాటు, పోలీసులు కూడా ముష్కరులను పట్టుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వంపై ఆగ్రహం..
ఈరోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో దుండగులపై వైమానిక దళ సిబ్బంది కూడా కాల్పులు జరపడంతో అనేక మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. గత వారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత మొహమ్మద్ బాబుల్ మియాను పలువురు కొట్టిచంపేశారు. దీంతో ఈ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు గతంలో కూడా మైనారిటీలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో యూనస్ రాజీనామా చేయాలని అనేక మంది డిమాండ్ చేశారు. దీనికి తోడు మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాలు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News