Trump Tower: ట్రంప్ టవర్ ముందు బ్లాస్ట్.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 09:02 AM
అగ్రరాజ్యం అమెరికా లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్ టవర్ వెలుపల పేలుడు సంభవించింది. ఈ ఘటనలో టెస్లా సైబర్‌ట్రక్ మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.
అమెరికా(america)లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వెగాస్(Las Vegas)లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ (Trump Tower) వెలుపల టెస్లా సైబర్‌ట్రక్‌లో పేలుడు, అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో అప్రమత్తమైన లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.
వీడియోలు వైరల్
ఉదయం 8:40 గంటలకు హోటల్ వ్యాలెట్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు క్లార్క్ కౌంటీ ప్రతినిధి తెలిపారు. హోటల్లోని వారికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, హోటల్ సమీపంలోని రోడ్లను మూసివేశారు. మారిసా అనే మరో X వినియోగదారు, హోటల్ నుంచి వీడియోను పంచుకుంటూ వారు ట్రంప్ హోటల్‌లో బస చేస్తున్నట్లు పేర్కొన్నారు. 26వ అంతస్థులోని ఎలివేటర్లు మూసుకుపోవడంతో కారిడార్లు పొగతో నిండిపోయాయని, హోటల్ నుంచి అతిథులకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదన్నారు.
ఎలాన్ మస్క్ స్పందన
డోనాల్డ్ ట్రంప్‌నకు చెందిన లాస్ వెగాస్ హోటల్ వెలుపల సైబర్‌ట్రక్‌లో జరిగిన పేలుడు ఘటనపై టెస్లా కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెంటనే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై సీనియర్ బృందం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. మాకు ఏదైనా తెలిసిన వెంటనే, మేము మరింత సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఇలాంటివి ఇంతకు ముందెన్నడూ చూడలేదని మస్క్ పేర్కొన్నారు. సైబర్ ట్రక్కులో అమర్చిన బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితి నెలకొంది.
ట్రంప్ టవర్‌లో సంబరాలు
కొలరాడో నుంచి ట్రక్కును అద్దెకు తీసుకుని హోటల్‌కు డెలివరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కులో గ్యాసోలిన్ డబ్బాలు, బాణసంచా లభ్యమైంది. వాహనం ఒక్కసారిగా ఆగిపోయి పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. న్యూ ఓర్లీన్స్‌లో ఇటీవల జరిగిన దాడి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని షెరీఫ్ మెక్‌మహిల్ తెలిపారు. న్యూ ఓర్లీన్స్‌లో జనంపైకి ఓ వ్యక్తి కారును దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన సమయంలో టెస్లా యజమాని ఎలాన్ మస్క్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ టవర్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు.
ప్రజల్లో ఆందోళన
ట్రక్కు బ్యాటరీ పేలిపోయిందని ఘటనా స్థలంలో ఉన్నవారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రక్కు చుట్టూ మంటలు, పొగలు కనిపిస్తున్నాయి. పేలుడు కారణంగా మా వస్తువులు కూడా కాలిపోయాయని అక్కడి స్థానికులు అన్నారు. ఈ టెస్లా సైబర్‌ట్రక్ పేలుడుపై ఎఫ్‌బీఐ, స్థానిక ఏజెన్సీలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరిన్ని ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News