Share News

Breaking News: బంగ్లాను ఆదుకున్న ఆ ఒక్కడు

ABN , First Publish Date - Feb 20 , 2025 | 10:50 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: బంగ్లాను ఆదుకున్న ఆ ఒక్కడు
Breaking News

Live News & Update

  • 2025-02-20T18:27:11+05:30

    బంగ్లాను ఆదుకున్న ఆ ఒక్కడు

    • ఛాంపియన్స్ ట్రోపీలో భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్

    • తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు

    • 49.4 ఓవర్లలో228 పరుగులకు బంగ్లా ఆలౌట్

    • బంగ్లాను సెంచరీతో ఆదుకున్న తౌహిద్ హృదయ్

    • 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

    • బంగ్లాను ఆదుకున్న జాకీర్ అలీ, తౌహిద్ హృదయ్

    • భారత్ విజయలక్ష్యం 229 పరుగులు

  • 2025-02-20T13:53:22+05:30

    ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ మార్పు

    • అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ మార్పు

    • ఈనెల 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం

    • ఈనెల 24న ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు

    • 24వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

    • 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ

    • అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడనున్న సీఎం చంద్రబాబు

  • 2025-02-20T13:29:19+05:30

    కొత్త మార్పు చూడబోతున్నాం: సీఎం చంద్రబాబు..

    • ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు

    • ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

    • ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం ఆనందంగా ఉందన్న చంద్రబాబు

    • ఇప్పుడు దేశ రాజధానిలో కొత్త శకం మొదలైందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి

    • ఇకపై అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం జరగబోతుందని చెప్పిన చంద్రబాబు

  • 2025-02-20T13:23:06+05:30

    ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్

    • ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా

    • రేఖా గుప్తాతో ప్రమాణస్వీకారం చేయించిన లెప్టినెంట్‌ గవర్నర్‌

    • మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆశిష్ సూద్, మంజిన్డెర్ సింగ్ సిర్సా, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్

    • ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పర్వేష్ వర్మ

    • ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు

    • ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • 2025-02-20T11:37:34+05:30

    సజ్జల దొరికిపోయినట్లేనా.. కబ్జా కేసులో కీలక పరిణామం..

    sajjala.jpg

    • కపడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ ఎస్టేట్‌లో అటవీ భూముల కబ్జాపై మరోసారి సర్వేకి ఆదేశించింది ప్రభుత్వం.

    • కడప ఆర్డీఓ, డిఎఫ్ఓ నేత్రృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.

    • నేటినుండి సజ్జల ఎస్టేట్‌లో సర్వే నిర్వహించనున్న అధికారుల బృందం.

    • కడపనగర శివారులలో వున్న సజ్జల ఎస్టేట్‌లో 52.40 ఎకరాలు ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్లు వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.

  • 2025-02-20T10:57:06+05:30

    వంశీకి బిగ్ షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం..

    vallabhaneni-vamshi.jpg

    • అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది.

    • ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

    • బెయిల్ మంజూరు చేసేది లేదంటూ స్పష్టం చేసింది.

  • 2025-02-20T10:53:18+05:30

    మహాకుంభ మేళాకు వెళ్తున్నారా.. బిగ్ అప్‌డేట్ మీకోసమే..

    Spl-Trains.jpg

    • ఏబీఎన్‌తో సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్వో శ్రీధర్.

    • ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.

    • కుంభమేళకు వెళ్లే భక్తులతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది.

    • ప్లాట్ ఫాంలపై రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

    • హైదరాబాద్ నుంచి కుంభమేళకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు.

    • ప్రత్యేక రైళ్ళలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి.

    • రద్దీనిబట్టి రైళ్ల సర్వీసులను పెంచుతాం.

    • ప్రయాగరాజ్ కు 180 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం.

    • మార్చ్ 1 వరకు ప్రత్యేక రైళ్ళు కొనసాగుతాయి.

  • 2025-02-20T10:50:22+05:30

    మంచిర్యాల: కవ్వాల్ టైగర్ జోన్ పై బీజేపీ ఎంపీ గొడం నగేష్ సంచలన వ్యాఖ్యలు.

    • టైగర్ జోన్ వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    • టైగర్ జోన్ ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేయడం తగదు.

    • నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం మేరకే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2012లో టైగర్ జోన్‌ను ఏర్పాటు చేసింది.

    • ప్రస్తుతం ప్రజల ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ.

    • ప్రజలపై ప్రేమ ఉంటే కవ్వాల్ టైగర్ జోన్‌ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి.

    • మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం.