-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates in Telugu News Saturday 8th March 2025 Siva
-

Breaking News: బ్రాహ్మణి గురించి ఇంట్రస్టింగ్ వివరాలు చెప్పిన మంత్రి లోకేష్..
ABN , First Publish Date - Mar 08 , 2025 | 10:09 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-08T13:20:19+05:30
ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్.
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము.
ఏపీలో వాట్సప్ సేవలను తీసుకువచ్చా.
మనమిత్ర పథకం ద్వారా వాట్స్అప్ సేవలను ఏపీలో అందుబాటులోకి తీసుకువచ్చాము.
కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్స్, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డ్స్ ఈజీగా వాట్సాప్ సేవలో పొందవచ్చు.
కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్.
టాటా పవర్ తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగింది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కి అందరూ సిద్ధంగా ఉండాలి.
మా రాష్ట్రంలో తెలుగును ప్రమోట్ చేస్తున్నాం.. స్థానిక భాష తెలుగు.
భాషను బలవంతంగా రుద్దుతారని నేను నమ్మను.
వివిధ భాషలు నేర్చుకోవడం అవసరం.
రెడ్ బుక్‌ను కొనసాగిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడు దేశ ప్రగతిలో దోహదపడుతుంది.
వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది.
ఎన్డీఏకు మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నాం.
హెచ్‌ఆర్‌డి శాఖ కావాలని నేను ఎంచుకున్నాను, దానిలో బలమైన టీచర్స్ యూనియన్ ఉన్నాయి.
నా భార్య నా క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుంది.
మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ జరుపుకోవాలి.
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో హైదరాబాదులో 45,000 మంది ఐటి ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతు తెలిపారు.
ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఇండియా గెలుస్తుంది.
-
2025-03-08T12:18:29+05:30
మధ్యాహ్నం ఈ ఏరియాలో కరెంట్ బంద్..
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
-
2025-03-08T12:17:20+05:30
బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య.
పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిన గంట విజయ గౌరీ(20).
బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి.
గత నెల ఫిబ్రవరి 6న ఈశ్వర రావుతో వివాహం.
మృతురాలు స్వస్థలం విజయనగరం జిల్లా.
నిన్న రాత్రి బాల్ రెడ్డి నగర్ లో జరిగిన ఘటన.
ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం.
-
2025-03-08T12:15:13+05:30
మహిళా దినోత్సవం.. బీజేపీ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..
ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.
ఢిల్లీలోని మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం కోసం మహిళా సమ్మాన్ పథకంపై నేడు ఢిల్లీ కేబినెట్‌లో చర్చ.
విధివిధానాలు అమలుపై నేడు చర్చ.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన బీజేపీ.
-
2025-03-08T10:09:15+05:30
రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం..
కడప : పులివెందులలో వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేస్తున్నారు వైద్యులు.
తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం నలుగురు.. కడపనుంచి 3 డాక్టర్లతో కూడినబృందం, ఫోరె న్సిక్ టీం సిబ్బంది వచ్చారు.
పులివెందుల తహసిల్దార్, వీఆర్వో, పోలీసు అధికారుల ఆధ్వ ర్యంలో సమాధి తవ్వకాలు నిర్వహించారు.