Share News

Breaking News: వివేకా హత్య కేసు.. కీలక సాక్షి మృతి..

ABN , First Publish Date - Mar 05 , 2025 | 09:02 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: వివేకా హత్య కేసు.. కీలక సాక్షి మృతి..
Breaking News

Live News & Update

  • 2025-03-05T22:04:05+05:30

    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి వారికి చెక్..

    • ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల రక్షణకు రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి

    • ప్రభుత్వ భూముల చట్టవిరుద్ధ రిజిస్ర్టేషన్లు రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు అప్పగిస్తున్నట్లు చెప్పిన మంత్రి అనగాని

    • ఇప్పటివరకూ కలెక్టర్ల వద్ద ఉన్న అధికారాన్ని తహసీల్దార్లకు బదిలీ చేస్తున్నట్లు మంత్రి అనగాని వెల్లడి

    • ప్రభుత్వ, అసైన్డ్, దేవదాయ భూములతోపాటు చట్టప్రకారం రిజిస్ర్టేషన్ చేయకూడని భూములు రిజిస్ట్రర్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుందని చెప్పిన మంత్రి

    • రద్దు చేయాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను తహసీల్దార్ సబ్ రిజిస్ర్టార్‌కు పంపిస్తారు: మంత్రి అనగాని

    • సబ్ రిజిస్ర్టార్ ఆ డాక్యుమెంట్ రద్దుకు చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేసి కాపీలను స్కాన్ చేసి రద్దు చేసిన డాక్యుమెంట్‌ను తహసీల్దార్ సూచించిన వ్యక్తులకు పంపిస్తారు: మంత్రి అనగాని

    • ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములను తప్పుడు పద్ధతుల్లో రిజిస్ర్టేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వానికి నివేదించిన రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ కమిషనర్

    • వీటిని నిరోధించడంలో భాగంగా తహసీల్దార్లకు చట్టవిరుద్ధ డాక్యుమెంట్లు రద్దు చేసే అధికారం అప్పగింత

  • 2025-03-05T20:46:22+05:30

    కేంద్రమంత్రులతో భేటీ.. సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..

    • ఇవాళ రెండు కీలక సమావేశాలు జరిగాయి: చంద్రబాబు

    • ఏపీ రాజకీయ పరిణామాలపై అమిత్‌ షాతో చర్చించాం: చంద్రబాబు

    • ఎన్డీఏ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించాం: చంద్రబాబు

    • ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు అంశంపై చర్చ జరిగింది: చంద్రబాబు

    • భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు..

    • గతంలో నాయకులు, అధికారులు కుమ్మక్కయ్యారు: చంద్రబాబు

    • గతంలో ప్రైవేట్‌ భూములను 22Eలో చేర్చారు: చంద్రబాబు

    • గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారు: చంద్రబాబు

    • గుజరాత్‌లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు విజయవంతంగా అమలైంది..

    • ఏపీ అసెంబ్లీ, మండలి ముందుకు బిల్లు వచ్చింది: చంద్రబాబు

    • ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లును ఆమోదించాలని కోరాం: చంద్రబాబు

    • ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం: చంద్రబాబు

    • ఏపీలో గంజాయి అనే మాట వినిపించకుండా చేస్తాం..

    • యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు: చంద్రబాబు

    • కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు: చంద్రబాబు

    • రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నాం: చంద్రబాబు

    • ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం: చంద్రబాబు

    • అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం: చంద్రబాబు

  • 2025-03-05T19:59:36+05:30

    వీడిన ఉత్కంఠ.. బీజేపీ అభ్యర్థి విజయం..

    • కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ MLCగా అంజిరెడ్డి గెలుపు

    • రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(BJP) విజయం

    • బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 78,635 ఓట్లు

    • కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు

    • బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు

    • మరికాసేపట్లో అధికారిక ప్రకటన

  • 2025-03-05T19:51:44+05:30

    వివేకా హత్య కేసు.. కీలక సాక్షి మృతి..

    • కడప: వైఎస్ వివేకానంద హత్య కేసు సాక్షి రంగయ్య మృతి

    • కడప రిమ్స్ లో చికిత్సపొందుతూ చనిపోయిన రంగయ్య

    • వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పని చేసిన రంగయ్య

  • 2025-03-05T17:59:07+05:30

    శిరీష హత్య కేసు.. నిందితులు అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి

    • హైదరాబాద్: చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసులో నిందితులు అరెస్ట్

    • నిందితులు సరిత, వినయ్ కుమార్, నిహల్ కుమార్ అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు

    • 2016లో సరిత, శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్‌లో పని చేశారు: ఏసీపీ శ్యామ్ సుందర్

    • 2016 ఏప్రిల్‌లో వినయ్ కుమార్‌తో శిరీష పెళ్లి సెట్ చేసింది సరిత: ఏసీపీ శ్యామ్ సుందర్

    • 2024లో హయత్ నగర్ వివేరలోనూ శిరీష పని చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • ఈ ఏడాది ఫిబ్రవరి 28న వివేర హాస్పిటల్‌లో బాధితురాలు రిజైన్ చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • సరితకు చెప్పకుండా శిరీష ఉద్యోగం మానేసింది, ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ: ఏసీపీ శ్యామ్ సుందర్

    • ఈనెల 1న శిరీషపై సరిత దాడి చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • అసభ్య పదజాలంతో దూషిస్తూ మెడపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • అపస్మారక స్థితిలో ఉన్న శిరీషకి హైడోస్ ఇంజెక్షన్ ఇచ్చింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీష స్పృహ కోల్పోయాక దిండుతో మొహంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • సరిత తన అక్క కొడుకు నిహాల్ సహాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • హత్యకు ఉపయోగించిన పిల్లో, బెడ్ షీట్, ఐరన్ రాడ్ సీజ్ చేశాం: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీష మేనమామ ఫిర్యాదు చేసి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు: ఏసీపీ శ్యామ్ సుందర్

    • మృతదేహాన్ని దోమలపెంట తరలిస్తున్న సమయంలో వినయ్ కుమార్‌కి కాల్ చేసి అంబులెన్స్‌ను వెనక్కి రప్పించాం: ఏసీపీ శ్యామ్ సుందర్

    • అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం: ఏసీపీ శ్యామ్ సుందర్

    • పోస్టుమార్టం రిపోర్టులో గొంతు నులిమి చంపినట్లు వైద్యులు తెలిపారు: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీష భర్త వినయ్ కుమార్, అక్క సరిత, మరో అక్క కొడుకు నిహాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించాం: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీషను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకుంది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • సరిత, శిరీష ఇద్దరూ సన్ రైజ్ హాస్పిటల్‌లో పరిచయం అయ్యారు: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీష అనాధ అవడంతో తన తమ్ముడు వినయ్‌తో పెళ్లి సంబంధం కుదిర్చింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • నర్స్ ట్రైనింగ్ చేసిన శిరీష సన్ రైజ్‌లో మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ హాస్పిటల్‌లో చేరింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • ఆ తర్వాత వివేర హాస్పిటల్‌లో చేరింది.. కొన్ని నెలల తర్వాత ఇక్కడా మానేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • ఒక్కచోట కూడా కుదురుగా పని చేయవు అని శిరీష, సరిత మధ్య గొడవ జరిగింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • గొడవ సమయంలో నీ చరిత్ర, అక్రమ సంబంధాలు అన్నీ తెలుసని, అందరికీ చెప్తానని శిరీష అన్నది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • మరుసటి రోజు శిరీష వెళ్లి సరితకు సారీ చెప్పింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • సరితకు మత్తుమందు వేసుకునే అలవాటు ఉంది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • శిరీష తనకు నిద్రపట్టడం లేదని, మత్తు మందు కొంచం ఇవ్వమని సరితను అడిగింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భావించిన సరిత.. మత్తుమందు డోస్ పెంచి ఇచ్చింది: ఏసీపీ శ్యామ్ సుందర్

    • మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన శిరీష మొహంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది: ఏసీపీ శ్యామ్ సుందర్

  • 2025-03-05T17:38:56+05:30

    సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్.. ఎక్కడంటే..

    • ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు

    • వరసగా కేంద్రమంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    • ఇవాళ సాయంత్రం 7 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్న ఏపీ సీఎం

    • కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీల భేటీల వివరాలను వెల్లడించనున్న చంద్రబాబు

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించే అవకాశం

  • 2025-03-05T17:35:24+05:30

    ఘరానా ముఠా అరెస్టు..

    • తిరుపతి: వరస చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పట్టుకున్న తిరుచానూరు పోలీసులు

    • తిరుపతి, తిరుచానూరు, భాకారపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంతాల్లో చోరీలు చేసిన ముఠా అరెస్టు

    • మెుత్తం 11 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు

    • నిందితుల నుంచి రూ.35 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు కారు, ఆటో, స్కూటీ స్వాధీనం

    • ఏడుగురు కలిసి ముఠాగా ఏర్పడి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    • నేరాలకు పాల్పడిన అందరి వయస్సూ సుమారు 30 సంవత్సరాల లోపే ఉందని వెల్లడి

    • పగలు రెక్కి నిర్వహించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడటం వీరి ప్రత్యేకతని చెప్పిన ఎస్పీ హర్షవర్ధన్

  • 2025-03-05T17:28:39+05:30

    జగన్.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ: మంత్రి నాదెండ్ల

    • అమరావతి: వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేసే వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్

    • నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించం: మంత్రి నాదెండ్ల

    • వై నాట్ 175 అని ఎగిరిన జగన్ కేవలం 11 సీట్లకు పడిపోవడంతో మతి భ్రమించింది: మంత్రి నాదెండ్ల

    • జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా?: మంత్రి నాదెండ్ల

    • తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ: మంత్రి నాదెండ్ల

    • ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు: మంత్రి నాదెండ్ల

    • తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా?: మంత్రి నాదెండ్ల

    • పవన్ కల్యాణ్ వేలాది మందికి ఆర్థియసాయం చేశారు: మంత్రి నాదెండ్ల

    • నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పునిచ్చింది ఏపీ యువత కాదా?: మంత్రి నాదెండ్ల

    • సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి నాదెండ్ల

    • మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలి: మంత్రి నాదెండ్ల

    • రైతులకు ధాన్యం కొనుగోళ్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయి నేడు రైతుల గురించి మాట్లాడుతున్నారు: మంత్రి నాదెండ్ల

    • నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా?: మంత్రి నాదెండ్ల

    • అధికారంలో ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి జగన్: మంత్రి నాదెండ్ల

    • ఇప్పుడు అది కాస్తా వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యేగా మారింది: మంత్రి నాదెండ్ల

    • జగన్.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువని మేము అనలేక కాదు, మాకు సభ్యత ఉంది: మంత్రి నాదెండ్ల

    • కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుంది: మంత్రి నాదెండ్ల

  • 2025-03-05T17:11:15+05:30

    ముగిసిన భేటీ..

    • ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ

    • అరగంటకుపైగా నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కొనసాగిన కీలక చర్చ

    • పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి

  • 2025-03-05T17:06:14+05:30

    మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

    • మార్చి 7న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • ఏఐసీసీ పెద్దలను కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో కీలక చర్చ

    • అదే రోజు సాయంత్రం ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

  • 2025-03-05T17:02:21+05:30

    కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై వీడని ఉత్కంఠ..

    • కరీంనగర్: ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం

    • కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ.. 56 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకూ 52మంది ఎలిమినేషన్

    • బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరు

    • ప్రసన్న హరికృష్ణ రెండో ప్రాధాన్యత ఓట్లపై తీవ్ర ఉత్కంఠ

    • ప్రసన్న హరికృష్ణ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయోనని తీవ్ర ఆసక్తి

    • గెలుపోటములను నిర్ణయించనున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

    • ఎమ్మెల్సీ గెలుపు కోటా ఓట్లు 1,11,672

    • కోటా ఓట్లకు 35 వేల ఓట్ల దూరంలో బీజేపీ, 40 వేల ఓట్ల దూరంలో కాంగ్రెస్

  • 2025-03-05T14:12:50+05:30

    మలక్‌పేట్ శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

    • హైదరాబాద్‌: మలక్‌పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్‌.

    • శిరీష భర్త వినయ్‌, సోదరి సరిత కలిసి హత్య చేసినట్టు గుర్తింపు.

    • సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు శిరీష హత్య.

    • 6 నెలల క్రితం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సరిత.

    • కొన్ని నెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న సరిత.

    • అక్రమ సంబంధంతో పరువుపోతుందని మందలించిన శిరీష.

    • కొంతకాలం నుంచి మత్తు ఇంజక్షన్లు వాడుతున్న శిరీష.

    • ఈనెల 2న సరిత, శిరీష మధ్య ఘర్షణ.

    • శిరీషకు సారీ చెప్పి నిద్రపోయేందుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన సరిత.

    • రాత్రి మత్తులోకి జారిపోయిన శిరీష.

    • ఓవర్‌డోస్‌ ఇచ్చి నిద్రలోనే శిరీష చనిపోయేలా చేసిన సరిత.

    • మరుసటిరోజు శిరీషను లేపేందుకు ప్రయత్నించినట్టు సరిత డ్రామా.

    • శిరీష లేవడం లేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లిన సరిత.

    • శిరీష గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లతో చెప్పించిన సరిత.

    • మృతదేహాన్ని హుటాహుటిన దోమలపెంటకు తరలించిన సరిత, వినయ్‌.

    • శిరీష మేనమామ ఎంటర్‌కావడంతో బట్టబయలైన హత్యా ఉదంతం.

    • దోమలపెంట నుంచి మృతదేహాన్ని రప్పించి పోస్టుమార్టం జరిపించిన మేనమామ.

    • శిరీషది హత్యగా పోస్టుమార్టంలో బయటపడటంతో సరిత, వినయ్‌ అరెస్ట్.

  • 2025-03-05T12:50:31+05:30

    కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ..

    • కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

    • ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

    • ఇప్పటి వరకు 28 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన అధికారులు.

    • కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    • మొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితం.

    • మొత్తం 56 మంది అభ్యర్థుల్లో 28 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన అధికారులు.

    • మొదటి ప్రాధాన్యత ఓట్లలో స్వల్ప ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.

    • రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి.

    • మూడో స్థానంతో సరిపెట్టుకున్న బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణ.

    • మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి అంజిరెడ్డి కి 75,675 ఓట్లు.

    • కాంగ్రెస్ నరేందర్ రెడ్డి కి 70,565.

    • బీఎస్పీ అభ్యర్థి హరి కృష్ణకు 60,419.

    • గెలుపు కోటాకు బీజేపీ అభ్యర్థికి 36 వేల అవసరం.

    • కాంగ్రెస్‌కు 41,107,

    • బీఎస్పీ అభ్యర్థికి 51 వేల ఓట్లు అవసరం.

  • 2025-03-05T12:17:12+05:30

    MLC Candidate Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు..

    ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబును ఎంపిక చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరును అనౌన్స్ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పని చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే ఎంపీగా పోటీ చేయాల్సి ఉండగా.. పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ నేతకు టికెట్ కేటాయించారు. దీంతో ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కన్ఫామ్ చేశారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని నాగబాబుకు పవన్ కల్యాణ్ సూచించారు.

  • 2025-03-05T11:20:33+05:30

    రైతులకు గుడ్ న్యూస్.. డేట్ అనౌన్స్ చేసిన సర్కార్..

    • అమరావతి: శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు.

    • మే నేలలో అన్నదాత సుఖీభవ ప్రారంభం.

    • అర్హత కలిగిన రైతులందరికి రూ. 20 వేల నగదు అందజేస్తాం.

    • కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విదివిదానాలు ఖరారు చేస్తున్నాం.

    • వైసిపి ప్రభుత్వం మాదిరిగా రైతులను మోసం చేయం.

    • వైసిపి ప్రభుత్వం 5 ఏళ్లలో వ్యవసాయానికి తాళం వేశారు.

    • వ్యవసాయ యంత్రాలు లేవు, భూసార పరిక్షలు లేవు, పంటల భీమా చెల్లింపులు లేవు.

    • ప్రభుత్వం ఇచ్చే నగదు రైతులు సాయం మాత్రమే.

    • వీటితోనే వ్యవసాయ సాగు చేయలేదు.

    • కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విదాలుదా అండగా ఉంటాం.

  • 2025-03-05T11:13:08+05:30

    నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

    • ఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.

    • పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం.

  • 2025-03-05T09:51:05+05:30

    సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..

    • అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.

    • సీఎం చంద్రబాబు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ నగరం, పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి వెళతారు.

    • అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళతారు.

    • గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లి 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.

    • ఢిల్లీలో ఓ శుభకార్యానికి హాజరవుతారు.

    • తిరిగి రాత్రి 9.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ వెళతారు.

    • 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారు.

    • అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.

    • 5.30 గంటలకు భారత్ మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌లో పాల్గొంటారు.

    • 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 7వ తేదీ ఉదయం బయలుదేరి అమరావతికి వస్తారు.

    • సీఎం చంద్రబాబు ఈ రోజు డిల్లీ విజిట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలను కలుస్తారు.

  • 2025-03-05T09:32:14+05:30

    స్పీకర్ రూలింగ్..

    • అమరావతి: 5,7,8,16,17లోక్ సభలోనూ ఎవ్వరికి 10శాతం రాకపోవడంతో ప్రతిపక్షహోదా ఎవ్వరికి రాలేదు.

    • ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో 20-01-2019న ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకి సభాపతి గుర్తింపు ఇచ్చారు.

    • అయితే 9-06-2019న సభలో సంఖ్యాబలం 10శాతం కన్నా తగ్గిందని నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదాను తొలగించారు.

  • 2025-03-05T09:30:29+05:30

    జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్..

    • అమరావతి: జగన్ 24-06-2025న నాకు ఓ లేఖ రాసారు. దానిలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయి.

    • ఈ లేఖలో ప్రతిపక్ష హోదా కావాలన్నారు.

    • ఈ లేఖ రాసిన కొద్ది రోజులకు జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

    • శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలి అని రిట్ పిటిషన్ వేశారు.

    • రిట్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉంది.

    • దీనిలో స్పీకర్‌ను, శాసనసభ వ్యవహరాల మంత్రిని పార్టీలను చేస్తూ పిటిషన్‌లో పేర్కోన్నారు.

    • ఈ పిటిషన్‌పై ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాం.

    • అయితే హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించినట్టు ప్రచారం చేస్తున్నారు.

    • జగన్ ఇలాంటి ప్రచారం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

    • దానిలో ఆయన కల్పిత విషయాలను ప్రస్తావించారు.

    • జగన్మోహన్ రెడ్డి న్యాయస్ధానాన్ని చూపుతూ చేస్తున్న అవాకులు, చవాకులపై రూలింగ్ ఇస్తున్నాను.

    • ప్రమాన స్వీకార కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రిగా మంత్రులు తరువాత ఆహ్వనించారు.

    • 11-1-1995న జరిగిన ప్రమాణంలో మాజీ ముఖ్యమంత్రిని మంత్రులు తరువాతే ప్రమాణం చేయించారు.

    • ఏపీ 16 వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకరం కార్యక్రమం 21-06-2024న జరిగింది.

    • స్పీకర్ ఎన్నిక మరునాడు జరిగింది.

    • ప్రతిపక్ష నాయకుడిగా నిరాకరిచామన్న వాదన సరికాదు.

    • జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికయినట్టు 26-06-2024 వరకూ మా సచివాలయానికి తెలుపలేదు.

    • అలాంటప్పుడు జూన్ 26 కన్నా ముందు అందునా స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాపై నిర్ణయం తీసుకోవడం సాధ్యామా.

    • ప్రతిపక్ష నాయకుడిగా ఎవ్వరయినా అర్హుడా లేదా అనేది రాజ్యాంగం, కోర్టు తీర్పులు మాత్రమే నిర్ధారించగలవు.

  • 2025-03-05T09:15:41+05:30

    ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..

    • రాష్ట్రంలో నేటి నుండి ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి.

    • పరీక్షలు రాసేందుకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

    • ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ కళాశాలల వద్ద పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    • విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారికి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.

    • ఉదయం 9 గంటల నుండి పరీక్ష ప్రారంభమై 12 గంటల వరకు పరీక్ష పూర్తి అవుతుంది.

    • పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

    • విద్యార్థులు ఉదయం 8:45 నిమిషాల్లోపు విద్యార్థులు అందరూ పరీక్ష కేంద్రం చేరుకోవాలని అధికారులు తెలిపారు.

    • పరీక్ష కేంద్రంలో బ్యాగులుఎలక్ట్రిక్ వస్తువులు సెల్ఫోన్లకు అనుమతించేది లేదంటూ అధికారులు తెలిపారు.

    • పరీక్షలు రాసే విద్యార్థులకు 9 గంటల ఐదు నిమిషాల వరకే అనుమతి ఉంటుందని.

  • 2025-03-05T09:10:09+05:30

    నేడు ఏపీ అసెంబ్లీ 5వ రోజు సమావేశాలు..

    • అమరావతి: నేడు ఏపీ అసెంబ్లీ 5వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.

    • ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభమవగా.. 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది.

    • ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం అవుతాయి.

    • కానిస్టేబుళ్ల నియామకం, పుత్తూరు బిజిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సౌకర్యాలు, తల్లికి వందనం, పుట్టపర్తిలో హంద్రీ నీవా పనులు, భోగాపురం ఎయిర్ పోర్ట్ రహదారి పనులు, రాష్ర్టంలో చేనేత రంగం, 2019-24 మధ్య ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు, తదిర అంశాల్లో శాసన సభలో సభ్యుల ప్రశ్నోత్తరాలు ఉంటాయి.

    • శాసన సభలో ఇంధన శాఖపై వార్షిక నివేదిక, ఆర్ అండ్ బి, ఇండస్ట్రీ‌స్, ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల ఆదాయ వ్యయ పట్టికలు సభలో ప్రవేశపెట్టనున్న మంత్రులు.

    • శాసన మండలిలో 2025- 26 రాష్ర్ట బడ్జెట్‌పై చర్చ.

    • 2019-24 లో భూకేటాయింపులు, పారామెడికల్ సిబ్బంది తొలగింపు, వి. జె ఇన్ఫ్రా పరిశ్రమ కాలుష్యం, ఆడుదాం ఆంధ్రలో నిధులు దుర్వినియోగం, అన్నదాత సుఖీభవ పథకం తదితర అంశాలపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు.

  • 2025-03-05T09:02:33+05:30

    సరికొత్త డ్రామాకు తెరతీసిన గోరంట్ల మాధవ్..

    • అనంతపురం: సరికొత్త డ్రామాకు తెరతీసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.

    • పోలీసుల విచారణకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తున్న గోరంట్ల మాధవ్.

    • విజయవాడ కు ఇంకా బయలుదేరని గోరంట్ల మాధవ్.

    • అనంతపురం నుంచి విజయవాడకు తొమ్మిది గంటల ప్రయాణం.

    • అయినా అనంతపురంలోనే ఉంటూ టైం పాస్ చేస్తున్న గోరంట్ల.

    • పైకి మాత్రం విచారణకు వెళ్తున్నానటూ పోలీసులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్న గోరంట్ల.

    • విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల నోటీసులో ఉదయం పది గంటలకు హాజరు కావాలంటూ స్పష్టంగా పేర్కొన్న పోలీసులు.

    • పది గంటలు అవుతున్నా అనంతపురంలోని తన ఇంటి వద్ద ఉన్న గోరంట్ల మాధవ్.