-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 10th April 2025 Thursday Live Updates on Top Stories Latest Headlines Politics, Sports, Business and Real-Time Updates in Telugu Siva
-
Flash News: మాజీ ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ABN , First Publish Date - Apr 10 , 2025 | 10:54 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-10T18:06:01+05:30
పోసాని కృష్ణమురళి కేసు.. సూళ్లూరుపేట SHOపై హైకోర్టు ఆగ్రహం..
పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ
సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా BNS 111, ఇతర సెక్షన్లు చేర్చారని కోర్టుకు తెలిపిన పోసాని లాయర్
విచారణ సందర్భంగా సూళ్లూరుపేట SHOపై మండిపడిన ఏపీ హైకోర్టు
తదుపరి విచారణకు తమ ఎదుట హాజరుకావాలని SHOకు ఆదేశం
కేసు తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా
-
2025-04-10T18:01:46+05:30
మాజీ ఎంపీని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గుంటూరు: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో మాధవ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించిన మాధవ్
పోలీస్ వాహనంలో కిరణ్‌ను గుంటూరుకు తరలించే సమయంలో అడ్డుకున్న మాధవ్
అనంతరం కిరణ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ మాధవ్
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
-
2025-04-10T14:53:31+05:30
భారత్‌కు చేరుకున్న ఉగ్రవాది తహవూర్ రాణా
భారత్‌కు LeT ఉగ్రవాది తహవూర్ రాణా
ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ప్రత్యేక విమానం
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దగ్గర SWAT కమెండో బృందం
ఉగ్రవాది తహవూర్ రాణాను ప్రశ్నించనున్న NIA
NIA కేంద్ర కార్యాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం
ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణా
-
2025-04-10T13:24:10+05:30
కామారెడ్డి: బెట్టింగ్ యాప్స్‌కు మరొకరు బలి.
తాడ్వాయి మండలం నందివాడకు చెందిన వ్యక్తి మృతి.
ఇంట్లో ఉరేసుకుని యువకుడు సతీష్ ఆత్మహత్య.
ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయిన సతీష్.
-
2025-04-10T11:30:46+05:30
నిజామాబాద్: కల్తీ కల్లుపై కొనసాగుతున్న ఎక్సయిజ్ దాడులు.
బీర్కూర్, నస్రుల్లాబాద్, గాంధారి, బాన్సువాడ మండలాల్లోని పలు కల్లు డిపోలు, దుకాణాల్లో తనిఖీలు.
ఇప్పటి వరకు 23 మంది కల్లు విక్రేతలపై కేసులు.
18 దుకాణాలు రద్దు.
నార్కోటిక్స్ పరీక్షలకు శాంపిళ్ళు.
గౌరారంలో ఆల్ఫాజోలం పట్టివేత.
పరారీలో ప్రధాన నిందితుడు సురేందర్ గౌడ్.
క్రమంగా కోలుకుంటున్న కల్తీకల్లు బాధితులు.
-
2025-04-10T11:29:21+05:30
ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌పై అధిష్టానం ఆగ్రహం
వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు
భారతిని అసభ్య పదజాలంతో దూషించిన చేబ్రోలు కిరణ్
కిరణ్‌ను సస్పెండ్ చేసిన టీడీపీ, గుంటూరు పోలీసులకు ఫిర్యాదు
-
2025-04-10T11:12:37+05:30
రామచంద్రాపురంలో ఉద్రిక్తత..
భద్రాద్రి: అశ్వాపురం మండలం రామచంద్రాపురంలో ఘర్షణ.
సారపాక ITC, TNTUC నాయకుడు హరిప్రసాద్ కారుపై దాడి.
భూవివాదంలో దాడి చేసిన కాంగ్రెస్ వర్గీయులు.
అడ్డుకోబోయిన సీఐ, గన్‌మెన్‌పైనా దాడి.
అశ్వాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన హరిప్రసాద్.
-
2025-04-10T10:54:54+05:30
నెల్లూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు.

దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు జారీ చేసిన పోలీసులు.
ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చిన పోలీసులు.
12 రోజులుగా పరారీలోనే కాకాణి సహా నలుగురు నిందితులు.
నిందితుల కోసం 6 బృందాలుగా పోలీసుల గాలింపు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో గాలింపు.
ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల.. వినియోగం, రవాణాపై ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.
విదేశాలకు రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఎగుమతి చేసిన కాకాణి అండ్ బ్యాచ్.
విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పోలీసులు ఆరా.
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసుల దర్యాప్తు.