-
-
Home » Mukhyaamshalu » Todays Breaking News 26th April 2025 Saturday Live Updates in Telugu News Siva
-
Breaking News: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ బందోబస్తు..
ABN , First Publish Date - Apr 26 , 2025 | 04:37 PM
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-04-26T18:29:30+05:30
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ బందోబస్తు..
ఆదివారం జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బందోబస్తులో పాల్గొననున్న 1100 మందికి పైగా పోలీసులు.
ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది ఇన్స్‌స్పెక్టర్లు /ఆర్.ఐలు, 66 మంది ఎస్.ఐ లు, 137 ఏ.ఎస్.ఐ లు/ హెడ్ కానిస్టేబుళ్ళు,511కానిస్టేబుళ్ళు, 200 హోంగార్డ్స్‌తో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
-
2025-04-26T17:30:30+05:30
ఇరిగేషన్ ENC హరీ రామ్ ఇంట్లో కొనసాగుతున్న ACB సోదాలు..
NDSA రిపోర్టు ఆధారంగా ఏసీబీ తనిఖీలు.
కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన హరిరామ్.
ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు.
11 గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.
ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.
భారీగా ఆస్తులు కూడ పెట్టినట్లు గుర్తించిన అధికారులు.
కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు.
నీటిపారుదల శాఖలో డిప్యూటీ ENC గా ఉన్న హరిరామ్ భార్య అనిత.
గజ్వేల్‌లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్‌లో లగ్జరీ ప్లాట్లు గుర్తించిన ఏసీబీ.
గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు.
గజ్వేల్ నియోజకవర్గం మార్కూక్‌లో 30 నుంచి 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి గుర్తింపు.
-
2025-04-26T17:26:00+05:30
భారత్ సమ్మిట్‌లో ముగిసిన ప్లీనరీ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బయల్దేరిన రాహుల్ గాంధీ
ఢిల్లీ వెళ్లనున్న రాహుల్ గాంధీ
-
2025-04-26T16:37:25+05:30
Bharat Summit: భారత్ సమ్మిట్‌కు హాజరైన రాహుల్ గాంధీ

హైదరాబాద్ HICCలో రెండో రోజు భారత్ సమ్మిట్.
హాజరైన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ.
పహల్గామ్ దాడి మృతులకు రాహుల్ నివాళులు.
భారత్ సమ్మిట్‌లో ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి.
పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేదు.
ఇప్పుడు అంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోంది.
ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోతున్నాయి.
చట్ట సభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావట్లేదు.
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు.
విపక్షాలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశా.
భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.
విద్య, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఆసన్నమైంది.
విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నా.
విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు గురవుతున్నాయని.
విపక్షాల వాదన వినిపించేందుకు.. కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పాత తరం రాజకీయం అంతరించిపోయింది.
ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోంది.