Maharashtra: 167 బారే సిండ్రోమ్ కేసులు నమోదు.. ప్రభుత్వం అలర్ట్..
ABN , Publish Date - Feb 11 , 2025 | 09:47 AM
గిలియన్ బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వ్యాధి గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో విస్తరిస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులు 167 నమోదయ్యాయి.

మహారాష్ట్ర(Maharashtra)లో గిలియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 192 అనుమానిత కేసులు నమోదు కాగా, వాటిలో 167 కేసులు నిర్ధారించబడ్డాయి. అంతేకాదు ఈ సిండ్రోమ్ కారణంగా ఏడుగురు మరణించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఒకరు GBS అని నిర్ధారించబడగా, ఇతర 6 కేసులపై అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..
అందులో పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 39, ఇతర గ్రామాల నుంచి 91, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే గ్రామీణ ప్రాంతంలో 25, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం 48 మంది రోగులు తీవ్రంగా జబ్బు పడగా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. అందులో 21 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. కానీ 91 మంది రోగులు మాత్రం చికిత్స అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.
నిబంధనలు పాటించడం లేదని..
ఈ కేసుల పెరుగుదల నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రభావిత ప్రాంతాలలో నిఘాను పెంచి చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 6న PMC, పూణే నగరం సింహగడ్ రోడ్డులోని నాందేడ్ గ్రామం, ధయారి, పరిసర ప్రాంతాలలో 30 ప్రైవేట్ నీటి సరఫరా ప్లాంట్లను సీజ్ చేశారు.
ఈ ప్రాంతాలలో నీటి మూలాలపై పరిస్థితిని పరిశీలించి సీజ్ చేసింది. ఈ ప్లాంట్లు నీటిని సరఫరా చేసే ముందు సరైన నిబంధనలు పాటించడం లేదని, అందులో కొన్ని ప్లాంట్లలో అస్వచ్ఛమైన నీటి నమూనాలు ఉన్నాయని వెల్లడించారు. కొన్ని ప్లాంట్లలో కోలి బ్యాక్టీరియా కలుషితం అయినట్లు PMC గుర్తించింది. అలాగే కొన్ని ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసే ప్రక్రియలు సరైన విధంగా నిర్వహించబడడం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యాధి స్పెషల్ ఏంటంటే..
గిలియన్ బారే సిండ్రోమ్ (GBS) లక్షణాలు ప్రత్యేకంగా నిర్ధారించబడినప్పటికీ, దీనికి సంబంధించి వైద్యులు మరింత పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు చికిత్స కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యాధి శరీర రోగనిరోధక వ్యవస్థతోపాటు పరిధీయ నాడీ వ్యవస్థపై కూడా దాడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా, కండరాల బలహీనత, నడకలో ఇబ్బందులు, నొప్పులు పలు సందర్భాలలో పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. GBS సాధారణంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ సంక్రమణ ద్వారా వస్తుందని వైద్యులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
EPFO: ఈ వినియోగదారులకు అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతా లింక్ చేశారా లేదా..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Read More Business News and Latest Telugu News