Share News

Maha Kumbh Mela 2025: భక్తులకు అలర్ట్.. మహా కుంభమేళాలో 5 కీలక మార్పులు..

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:55 AM

మహా కుంభమేళా 2025ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఐదు కీలక మార్పులను ప్రకటించింది. ఈ క్రమంలో భక్తులు వీటిని పాటించాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Maha Kumbh Mela 2025: భక్తులకు అలర్ట్.. మహా కుంభమేళాలో 5 కీలక మార్పులు..
Maha Kumbh Mela 2025

ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025) ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఉత్సవం సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడనున్నాయి. ఈ మార్పులు భక్తులు సురక్షితంగా ఆయా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడతాయి. ఈ మహా కుంభమేళాలో తీసుకున్న ఐదు కీలక మార్పులు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


1. రద్దీ తగ్గించేందుకు చర్యలు

ఈ సారి భక్తుల రద్దీని నియంత్రించడానికి, ముఖ్యంగా ప్రధాన ఘాట్ల దగ్గర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. ప్రతి గంటకు ఒక సెట్‌ కొంతమంది భక్తులను మాత్రమే అనుమతించడం ద్వారా రద్దీని కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమైన ఘాట్ల వద్ద రద్దీని తగ్గించడం, భక్తులకు బాగా ప్రాధాన్యత ఇవ్వడం, వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఈ చర్యలు తీసుకోబడినట్లు ప్రభుత్వం తెలిపింది.

2. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్‌ జోన్‌ అమలు

మహా కుంభమేళా ప్రాంతంలో పర్యటించే భక్తుల రవాణాను బాగా కంట్రోల్ చేయడం కోసం ఫిబ్రవరి 4 వరకు "నో వెహికల్ జోన్" (No Vehicle Zone) అమలు చేయాలని నిర్ణయించారు. అంటే భక్తులు ప్రదేశంలో అడుగు పెట్టే ముందు తమ వాహనాలను ఆయా ప్రాంతాలలో మాత్రమే పార్క్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీలైనంత వరకు అందరికీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ జామ్, రద్దీని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.


3. ఇతర రాష్ట్రాల వాహనాలకు అనుమతి నిరాకరణ

ఈసారి మహా కుంభమేళా ఉత్సవంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ఆ ప్రాంతంలో ప్రవేశించకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగా తమ వాహనాన్ని నమోదు చేసుకుని మాత్రమే పర్యటనకు రావాల్సి ఉంటుంది. ఈ చర్యకు అనుగుణంగా, వాహనాల సంఖ్యను కూడా నియంత్రించేందుకు ఇది సహాయపడుతుంది.


4. వన్‌ వే రూట్‌ అమలు

భక్తుల రవాణా సరళతను పెంచేందుకు, ప్రయాగ్ రాజ్‌ నగరంలో వన్‌ వే రూట్‌ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రాంతాలకు, ఘాట్ల దగ్గరకు వెళ్లే దారులను ఒకవైపుగా మార్చి, మరో వైపు నుంచి రాకపోకలను పూర్తిగా వేరే రూట్లతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా భక్తుల రవాణా మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

5. వీఐపీ పాస్‌లు రద్దు చేసిన ప్రభుత్వం

మహా కుంభమేళాలో ఇతర సంవత్సరాల్లో వీఐపీ పాస్‌లు ఇచ్చి, ముఖ్య అతిథులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుండగా, ఈసారి యూపీ ప్రభుత్వం ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. "వీఐపీ పాస్‌లు" ఇకపై ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ విధానం ద్వారా వీఐపీలు, సర్వసాధారణ భక్తులకు సమానమైన అవకాశం కల్పించబడుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజల మధ్య అసమానతలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాక ఇందులో వీఐపీ పాస్‌ల ద్వారా ఏర్పడే అనవసరమైన రద్దీని కూడా తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతీ సంవత్సరం కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటూ తమ ఆధ్యాత్మిక మొక్కులను తీర్చుకుంటారు.


ఇవి కూడా చదవండి:

Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..


MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 11:55 AM