Share News

Accident: కుప్పకూలిన నిర్మాణంలోని భవనం.. శిథిలాల కింద 35 మంది..

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:34 PM

కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న లింటెల్ కూలిపోయింది. ఈ ఘటనలో 35 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో చాలా మందిని అధికారులు రక్షించారు.

Accident: కుప్పకూలిన నిర్మాణంలోని భవనం.. శిథిలాల కింద 35 మంది..
Kannauj Railway Station accident

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌(Kannauj Railway Station)లో నిర్మాణంలో ఉన్న భవనం శుక్రవారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో శిథిలాల కింద డజన్ల కొద్దీ కార్మికులు చిక్కుకున్నారు. స్టేషన్‌లో సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రెండంతస్తుల భవనం పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 35 మంది ఉద్యోగులు ఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన రైల్వే, పోలీసులు పరిపాలనా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 23 మంది కార్మికులను శిథిలాల నుంచి రక్షించి బయటకు తీశారు.


అధికారుల చర్యలు

రైల్వే అమృత్ భారత్ యోజన కింద మూడు స్టేషన్లను ఎంపిక చేసినట్లు రైల్వే బోర్డు సభ్యుడు సత్యేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఇందులో కన్నౌజ్ కూడా ఉంది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న లింటెల్ అనుకోకుండా పడిపోయింది. వెంటనే సమాచారం తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్మాణంలో ఉన్న పైకప్పు షట్టరింగ్ కూలిపోవడంతో ఈ ఘటన సంభవించిందని జిల్లా మేజిస్ట్రేట్ శుభ్రాంత్ కుమార్ శుక్లా తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది.


పరిహారం ప్రకటన

చిక్కుకున్న కార్మికులను రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. సహాయక చర్యల కోసం మా వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5,000 పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సహాయ, రక్షణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఈశాన్య రైల్వే తెలిపింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ప్రయాణీకుల వేచి ఉండే గది కూడా కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థానిక పరిపాలనను ఆదేశించింది. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పలువురు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 11 , 2025 | 05:35 PM