Ajit Pawar: బీఎంసీ ఎన్నికల్లో అజిత్ పవార్ సొంత కుంపటి
ABN , Publish Date - Jan 14 , 2025 | 07:43 PM
ఎన్‌సీపీ(అజిత్ పవార్) నేతల సమాచారం ప్రకారం, బీఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకు వెళ్లే కీలక బాధ్యతలను ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌కు అప్పగించనున్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తుండటంతో అధికార, విపక్ష కూటములు, ఆ రెండు కూటమిల్లోని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. పార్టీల వారిగా విడివిడిగా పోటీ చేసే ఆలోచనకు కూడా పదునుపెడుతున్నాయి. తాజాగా అధికార 'మహాయుతి' కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఎన్‌సీపీ (NCP) కూడా ఆ దిశగా పావులు కదుపుతోంది. బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)లో ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది.
Delhi Assembly Elections: ఇదే కేజ్రీవాల్ 'చమక్‌తీ' ఢిల్లీ.. రాహుల్ వీడియో
ఎన్‌సీపీ(అజిత్ పవార్) నేతల సమాచారం ప్రకారం, బీఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకు వెళ్లే కీలక బాధ్యతలను ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌కు అప్పగించనున్నారు. సివిక్ పోల్స్ ఎలక్షన్ ఇన్‌చార్జిగా ఆయనను పార్టీ నియమించనుంది. తద్వారా ముంబైలో ఎన్‌సీపీ పట్టును పెంచుకోవాలనుకుంటోంది. మహారాష్ట్రలోని అధికార 'మహాయుతి'లో బీజేపీ కీలక భాగస్వాములుగా శివసేన (ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్) ఉన్నాయి.
ఎంవీఏలోనూ..
మరోవైపు, విపక్ష 'మహా వికాస్ అఘాడి'లోనూ ప్రధాన పార్టీలు బీఎంసీ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నాయి. ఎంవీఏ కీలక భాగస్వామిగా ఉన్న శివసేన (యూబీటీ) ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్‌సీపీ (ఎస్‌పీ), కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఒంటరి పోరుకు సిద్ధమైతే, ఎంవీఏలోని కాంగ్రెస్‌కు సైతం ఒంటరిపోరు అనివార్యమవుతుంది.
ఇవి కూడా చదవండి..
Mahakumbhamela : మహా కుంభమేళాలో.. ఐఐటీ బాబా..
Chennai: తీరప్రాంతానికి కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలు
Read Latest National News and Telugu News