Arvind Kejriwal: ఎంసీడీ మేయర్ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:06 PM
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) ఆ పార్టీలో చేరారు. అనంతరం సచ్‌దేవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుందని చెప్పారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల ఆధికారం కోల్పోయిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీ (BJP)లో శనివారంనాడు చేరారు. ఏప్రిల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) మేయర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆప్‌కు శరాఘాతమే అవుతుంది. బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగపడతాయి.
Rahul Gandhi: ఏఐపై వట్టి మాటలు కాదు, గట్టి చేతలు కావాలి: రాహుల్
ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ సమక్షంలో ఆప్ కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కే పురం) ఆ పార్టీలో చేరారు. అనంతరం సచ్‌దేవ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడనుందని, మోదీ 'వికసిత్ భారత్' భారత్ లక్ష్యసాధనలో భాగంగా ఢిల్లీ అభివృద్ధికి ఇదే సరైన తరుణమని అన్నారు. ఢిల్లీని క్లీన్ అండ్ బ్యూటిఫుల్ సిటీగా మార్చేందుకు కౌన్సిలర్లు బీజేపీలో చేరారని చెప్పారు.
ఎంసీడీ మేయర్ ఎన్నికలు
ఎంసీడీ మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నాయి. గత మేయర్ ఎన్నికలు 2024 నవంబర్‌లో జరుగగా, మూడు ఓట్ల ఆధిక్యంతో ఆప్ గెలిచింది. ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కౌన్సిలర్లతో పాటు, ఏడుగురు లోక్‌సభ ఎంపీలు (వీరంతా బీజేపీకి చెందినవారు), ముగ్గురు రాజ్యసభ ఎంపీలు (వీరంతా ఆప్‌కు చెందిన వారు), 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ హక్కు ఉంటుంది. తాజాగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో ఆప్ సంఖ్యాబలాన్ని బీజేపీ అధిగమించింది. 2022 ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు, బీజేపీ 104, కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్లు 3 వార్డులు గెలుచుకున్నారు. కాగా, ఈనెల 13న ఎంసీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17,000 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పారిశుధ్యానికి అత్యధికంగా రూ.4,907.11 కోట్లు కేటాయించారు.
ఇవి కూడా చదవండి...
US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..
Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.