Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:58 PM
నిజమైన శివసేన నేత ఎవరో 2024లో ప్రజలే నిర్ణయించారని, దోశద్రోహి ఎవరో, ఆత్మగౌరవం కలవారెవరో ప్రజలు నిర్ణయించిన విషయాన్ని కమ్రా తెలుసుకోవాలని ఫడ్నవిస్ అన్నారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని షిండే ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) సోమవారంనాడు స్పందించారు. దిగజారుడు హాస్యంతో డిప్యూటీ సీఎంను అవమానించడం ఆమోదయోగ్యం కాదని, ఆ వ్యాఖ్యలపై కునాల్ క్షమాపణ చెప్పాలని అన్నారు.
Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..
"హాస్యానికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఎవరినీ అమానించేలా హాస్యం ఉండకూడదు. భావ ప్రకటనా స్వేచ్ఛను మేము గౌరవిస్తాం. నిర్లక్ష్యాన్ని మాత్రం సహించం" అని ఫడ్నవిస్ అన్నారు. నిజమైన శివసేన నేత ఎవరో 2024లో ప్రజలే నిర్ణయించారని, దోశద్రోహి ఎవరో, ఆత్మగౌరవం కలవారెవరో ప్రజలు నిర్ణయించిన విషయాన్ని కమ్రా తెలుసుకోవాలన్నారు. బాలాసాహెబ్ థాకరే వారసత్వాన్ని షిండే ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదు: అజిత్ పవార్
కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం స్పందించారు. చట్టపరమైన హద్దులను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. చట్టం, రాజ్యాంగం, నిబంధనలకు ఎవరూ అతీతులు కాదని, ఎవరైనా సరై హద్దుల్లో ఉండే మాట్లాడాలని, కానీ వారి మాటల ద్వారా పోలీసు శాఖ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు.
కమ్రా ఏమన్నారంటే?
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామిడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో జరిగింది. మహారాష్ట్ర రాజకీయాల గురించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివసేన నుంచి శివసేన బయటకు వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందని అన్నారు. ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా ద్రోహిగా అభివర్ణిస్తూ, 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయ కోణంలో మార్చి పాడారు. కమ్ర వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మహారాష్ట్ర పాపులర్ సీఎం, డిప్యూటీ సీఎంను ద్రోహి అంటూ కామెడీ చేస్తారా? ఇది కామెడీనా? వల్గారిటీనా? అంటూ శివసేన నేత షైనా ఎన్‌సీ మండిపడ్డారు. ఆ పార్టీ నేత ముర్జీ పటేల్ ఎంఐడీసీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. కునాల్ కమ్ర వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు సభావేదికను ధ్వంసం చేశారు. వారిపై కామెడీ క్లబ్ కేసు పెట్టింది.
ఇవి కూడా చదవండి..