Share News

Crowdfunding: సీఎం క్రౌడ్‌ఫ్రండింగ్.. 24 గంటల్లో రూ.17 లక్షలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 06:21 PM

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు.

Crowdfunding: సీఎం క్రౌడ్‌ఫ్రండింగ్.. 24 గంటల్లో రూ.17 లక్షలు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన డబ్బు లేదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) ప్రారంభించిన ఆన్‌లైన్ 'క్రౌడ్ ఫండింగ్' (Crowdfunding) డ్రైవ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లో 335 మంది దాతలు రూ.17 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు. అంత డబ్బు తనవద్ద లేదంటూ విరాళాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇందుకోసం ఆన్‌లైన్ లింక్‌ను ఆదివారం విడుదల చేశారు.

Delhi High Court: కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు జాప్యం.. ఆప్ సర్కారుపై హైకోర్టు అసహనం


కాగా, తాను చేసిన విజ్ఞప్తికి తొలి రోజే అనూహ్య స్పందన రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అతిషి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిష్కళంక, నిజాయతీ, ట్రాన్ఫర్మేటివ్ పాలిటిక్స్‌పై ప్రజలు చెక్కుచెదరని నమ్మకం ప్రదర్శించారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.


క్రౌడ్ ఫండింగ్ డ్రైవ్‌ను అతిశి ఆదివారంనాడు ప్రారంభిస్తూ, ఎన్నికల కోసం బడా వ్యాపారుల నుంచి తాము డబ్బులు తీసుకోమని, ఆప్ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. కల్జాజీ నుంచి పోటీకి తనకు రూ.40 లక్షలు అవుతుందని, అంత డబ్బు తనవద్ద లేనందున ప్రజలు తమకు తోచిన విరాళాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ మాజీ ఎంపీ, నీనియర్ నేత రమేష్ బిధూరితో కల్కాజీ నియోజకవర్గంలో అతిషి పోటీపడుతున్నారు. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

PM Modi: అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 06:27 PM