Salita Barman: సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్..
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:07 PM
Salita Barman: సామాన్యులు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లితే.. ఏం జరుగుతోంది?. తన భర్తను తీసుకు వెళ్లిన సలితకు అదే జరిగింది.
కోల్‌కతా, జనవరి 14: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నత పదవులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులు.. తీవ్ర అనారోగ్యానికి గురైతే.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతోన్నారు. ఈ తరహా ఘటనలు కోకోల్లలు. అంటే తాము విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రులపైనే వారికి నమ్మకం ఉండడం లేదు. ఇక దేశంలో చట్టాలు చేసి రాజకీయ నాయకులు సైతం తమకు కానీ.. తమ కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్యానికి గురైతే.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు.
కానీ పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రం ఇంకా ప్రభుత్వాసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఆయా ఆసుపత్రుల్లో సమస్యలు తాండవ చేస్తున్నాయి. వీటికి పట్టించుకొనే నాధుడే లేడు. అందుకు పశ్చిమ బెంగాల్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని రాయిగంజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో తాజా సంఘటన చోటు చేసుకుంది.
సదరు జిల్లాలోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన పరితోష్ బర్మన్ (51).. గృహనిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడి కాలికి ఇటీవల తీవ్ర గాయమైంది. అతడు నడవ లేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి భార్య సలితా బర్మన్.. రాయ్‌గంజ్ గవర్నమెంట్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రికి ఆటోలో తీసుకు వచ్చింది. అయితే ఆ ఆటోను ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద వైద్య సిబ్బంది నిలిపివేశారు.
పరితోష్ నవడ లేడు..ఆటోను ఆసుపత్రిలోని ఓపీ విభాగం వద్దకు అనుమతి ఇవ్వాలని కోరినా.. వైద్య సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. పోనీ వీల్ చైర్ అయినా సమకూర్చాలని వైద్య సిబ్బందిని వారు కోరారు. వీల్ చైర్ లేదంటూ వారు ఏ మాత్రం మొహమాటం పడకుండా సమాధాన మిచ్చారు. భర్త నడవ లేని స్థితిలో ఉండడంతో.. అతడిని భుజంపై వేసుకొని ఆసుపత్రిలోకి తీసుకు వెళ్లింది.
Also Read: మహాకుంభ మేళపై ఆసక్తికర వ్యాఖ్యలు.. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత
దీనిని అక్కడే ఉన్న స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అలాగే ప్రభుత్వం ఆధ్వరంలో నడిచే ఆసుపత్రుల్లో సమస్యలు తిష్టవేశాయంటూ నెటిజన్లు మండిపడుతోన్నారు. మరోవైపు ఈ ఘటన వైరల్ కావడంతో..సదరు ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరత ఉందని స్పష్టం చేశారు.
Also Read: బీజేపీ నేతలపై సీఎం సిద్దరామయ్య ఫైర్
మరోవైపు గతేడాది కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఈ వైద్య విద్యార్థి హత్యాచార ఘటనను సీబీఐ దర్యాప్తునకు కోల్ కతా హైకోర్టు ఆదేశించిన విషయం విధితమే.
For National New And Telugu News