Share News

Bhole Baba: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్

ABN , Publish Date - Feb 21 , 2025 | 03:09 PM

Bhole Baba: సత్సంగ్‌ నిర్వహణ అనంతరం జరిగిన తొక్కిసలాటలో 121 మంది మ రణించారు. ఈ ఘటనకు బోలే బాబా దోషి కాదని జ్యూడిషియల్ కమిషన్ స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దారుణం జరిగిందని స్పష్టం చేసింది. ఈ తప్పునకు బాధ్యత నిర్వహాకులదేనని సదరు కమిషన్ కుండబద్దలు కొట్టింది.

Bhole Baba: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్

లక్నో, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతి చెందారు. ఈ ఘటనలో బోలే బాబాకు జ్యూడిషియల్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటన పోలీసుల నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుందని జ్యూడిషియల్ కమిషన్ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యులు కార్యక్రమ నిర్వాహకులేనని జ్యూడిషియల్ కమిషన్ స్పష్టం చేసింది. ఇక అదే సమయంలో ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు సైతం జ్యూడిషియల్ కమిషన్ చేసింది.

baba-up.jpg

ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ యా వేదికలను పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ తరహా కార్యక్రమాల ఏర్పాటుకు అనుమతి కోరినప్పుడు.. నిర్వహాకులు తప్పని సరిగ్గా నిబంధనలు పాటించేలా చూడాలని పేర్కొంది. తద్వారా ఈ తరహా ఘటనలు నివారించవచ్చని సూచించింది. అదే సమయంలో ఓ వేళ.. నిర్వహకులు ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండాలని జ్యూడిషియల్ కమిషన్ స్పష్టం చేసింది.


2024, జులై 2వ తేదీన సికంద్రారావులోని ఫుల్లెరాయ్ మొఘట్ గఢి గ్రామంలో నారాయణ్ సకారి హరి బోలే బాబా అలియాస్ సురజ్‌పాల్ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన వెళ్లిపోయే సమయంలో.. బోలే బాబా పాద దూళిని కోసం జనం ఒక్కసారగా పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 121 మంది మరణించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు.


ఈ ఘటనపై యూపీలోకి యోగి ప్రభుత్వం స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ జులై 3వ తేదీన.. ముగ్గురు సభ్యులతో జ్యూడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు యోగి ప్రభుత్వం ప్రకటించింది.మరోవైపు.. ఈ కార్యక్రమం నిర్వహాణలో ముఖ్య సేవాదార్ దేవ్ ప్రకాశ్ మధుకర్‌‌తోపాటు పలువురు సేవాదార్‌లపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.


పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ సన్యాసుల్లో సంత్ నారాయణ్ సకారి హరి ఒకరు. నిత్యం తెల్ల దస్తులతోపాటు టై కట్టుకొని సత్సంగ్ కార్యక్రమాల్లో ఆయన ప్రవచనాలు చెబుతుంటారు. ఈ సత్సంగ్ కార్యక్రమాలకు ఆయన తన సతీమణితో కలిసి వస్తారు. ఆయన ప్రవచనాలు చెప్పే సమయంలో.. ఆయన భార్య పక్కనే కూర్చొని ఉంటారు. అయితే సంత్ నారాయణ్ సకారి హరి.. గతంలో ఇతా జిల్లాలోని బహదూర్ నగర్‌లో పోలీస్ శాఖలో చిన్న స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వర్తించే వారు.


1990లో ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. బాబాగా అవతారం ఎత్తారు. అయితే కోవిడ్ సమయంలో.. ఆయన పలు సత్సంగ్‌లు నిర్వహించే వారు. అలా ఆయన సత్సంగ్ కార్యక్రమాలకు ప్రజాదరణ ఏర్పడింది. ఇంకోవైపు నారాయణ్ హరికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్నట్లు ఓ ప్రచారం సైతం సాగుతోంది. పలు సందర్భాల్లో ఆయన నిర్వహించిన సత్సంగ్‌లకు వారు సైతం ముఖ్య అతిథిగా హాజరైనట్లు ఓ చర్చ సైతం సాగుతోంది.

For National News and Telugu News

Updated Date - Feb 21 , 2025 | 03:17 PM