Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై నెటిజన్ల ప్రశంసలు
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:32 PM
Prashant Kishor: పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో బిహార్ కీ కేజ్రీవాల్ అంటూ నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.
పాట్నా, జనవరి 03: పరీక్ష ప్రశ్న పత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో బిహార్ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అలాగే ఈ దీక్షపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బిహార్ కీ కేజ్రీవాల్ అంటూ ప్రశాంత్ కిషోర్‌ను వారు సంబోధిస్తున్నారు. ఇక ఆందోళనకారులు భారీగా దీక్షా శిబిరానికి చేరుకొని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్‌కు మద్దతు తెలిపారు.
ఇక బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు సంధించారు. సీఎంగా నితీష్ పని చేయాలనుకోవడం లేదని.. ఆయన అధికారంలో ఉంటే చాలనుకొంటున్నారన్నారు. కోవిడ్ సమయంలో సైతం ఆయన ఇదే రీతిలో వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన ధ్యాస అంతా అధికారంపైనే కానీ.. ఇతర అంశాలపై కాదంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. తన నిరసన కొనసాగుతోందని స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా తాను బిహార్‌లో పని చేస్తున్నానని గుర్తు చేశారు. రాజకీయాల్లో భాగంగా తాను ఇలా చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అదే తరహాలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు.
ఈ పరీక్షను నిర్వహించమని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హామీ ఇస్తే.. తాము ఈ ఆందోళనలు నిలిపివేస్తామని ఆందోళనకారులు ప్రకటించారన్నారు. కానీ ఆ అహంభావ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదని చెప్పారు. అంతేకాకుండా.. ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగిన వారిపై దాడి జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ఆమరణ నిరాహార దీక్ష తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ దీక్ష కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?
ఇంకోవైపు ఈ ఆందోళనకు మద్దతుగా శుక్రవారం ఉదయం సచివాలయం రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్‌పై తన అనుచరులతో కలిసి పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్.. ఆందోళనకు దిగారు. ఈ ఆందోళను పోలీసులు చెదరగొట్టారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రం లీకు అయిందంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు అన్ని వర్గాల మద్దతు లభించింది. ఈ ఆందోళలను అణచివేసేందుకు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులోభాగంగా డిసెంబర్ 29వ తేదీ ఆదివారం.. పాట్నాలో విద్యార్థులు ఆందోళలకు దిగారు. వారిపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించడంతోపాటు లాఠీ ఛార్జీకి దిగారు.
Also Read: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..
విద్యార్థుల ఆందోళనలకు ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. ఆ క్రమంలో పోలీసుల చర్యను ఆయన ఖండించారు. విద్యార్థులకు నితీష్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం అంటే జనవరి 2వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో గురువారం పట్నాలో ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ.. ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
For National News And Telugu News