Delhi Election: ఢిల్లీ నుంచి గల్లీ వరకు విజయాలన్నీ మావే: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
ABN , Publish Date - Feb 09 , 2025 | 01:15 PM
ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఉన్నంత వరకు కూటమి విజయాలకు ఢోకా ఉండదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. వైయస్ జగన్ వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం భయపడాల్సిన అవసరం ఉండదన్నారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఉన్నంత వరకు కూటమి విజయాలకు ఢోకా ఉండదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. వైయస్ జగన్ వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం భయపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా, బీజేపీ విజయం సాధించడ ఖాయం అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో విష్ణు కుమార్ రాజ్ మాట్లాడారు.
``ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఇక్కడ జగన్ ఉన్నంతవరకు, అక్కడ బీజేపీకి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ప్రజలకు అందరి గురించీ తెలుసు. ఎవరిని గెలిపించాలో తెలుసు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా, బీజేపీదే విజయం. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా మా పార్టీని బలంగా నమ్మారు`` అని విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే ఇటీవల జగన్ మాట్లాడుతున్న 2.0 గురించి కూడా విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
``జగన్ 2.0 అంటూ ఊహల్లో విహరించడం మానసిక సమస్యకు నిదర్శనం. ఆయన మాటలు సినిమాల్లో సరిపోతాయి. వాస్తవ ప్రపంచంలో సూట్ కావు. బూతులు మంత్రులని మాపార్టీలోకి తీసుకోం. అలాంటి వారికి కూటమి పార్టీలలు దూరంగా ఉంటాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే బెటర్. భవిష్యత్తులో కూటమికి అన్నీ విజయాలే. వైసీపీకి అన్నీ అపజేయాలే`` అని విష్ణుకుమార్ రాజు అన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..