Rahul: రాహుల్‌కు ఎందుకంత ప్రేమ?.. వియత్నాం పర్యటనపై బీజేపీ
ABN , Publish Date - Mar 15 , 2025 | 10:00 PM
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ "రహస్య పర్యటనలు'' చేయడం తగదని, ఇందువల్ల జాతీయ భద్రతకు ప్రమాదం కలగవచ్చని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎవరికీ చెప్పకుండా వియత్నాం వెళ్లినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ స్పందించింది. ఆయన తన సొంత నియోజకవర్గం కంటే వియత్నాంలోనే ఎక్కువ రోజులు ఉంటున్నారని విమర్శించింది. వియత్నాం అంటే ఆయనకు ఎందుకంత ప్రేమో చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ "రహస్య పర్యటనలు'' చేయడం తగదని, ఇందువల్ల జాతీయ భద్రతకు ప్రమాదం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు
''న్యూఇయర్ సమయంలో వియత్నాం వెళ్లిన రాహుల్ తాజాగా హోలీకి వియత్నంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో కంటే వియత్నాంలోనే ఎక్కువగా ఉంటున్నారు. అకస్మాత్తుగా వియత్నాంపై ఆయనకు అంత ప్రేమ కలగడానికి కారణం ఏమిటి? ప్రతిపక్ష నేతగా ఆయన భారత్‌లో ఉండాల్సిన అవసరం ఉంది'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా...
పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా రాహుల్ విదేశీ పర్యటనలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ ఐటీ సెల్ చీప్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. ''లోక్‌సభలో విపత్ర నేతగా ఆయన కీలక స్థానంలో ఉన్నారు. ఆయన తరచు విదేశాలకు వెళ్తుండటం, ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా రహస్య పర్యటనలు జరపడంలో ఔచిత్యం, జాతీయ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి'' అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
ఆ హక్కు ఆయనకు ఉంది: కాంగ్రెస్
కాగా, రాహుల్ ప్రైవేటు పర్యటనలు బీజేపీ రాజకీయం చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఒక వ్యక్తిగా ఆయనకు విదేశాలకు వెళ్లే హక్కు ఉందని ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..