Central Governmen Assures Supreme Court: వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్లం
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:59 AM
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే అవసరం లేదని కేంద్రం అభ్యర్థించగా, తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులపై చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టులో హామీ ఇచ్చింది. చట్టంలోని 9, 14 సెక్షన్ల కింద నియామకాలూ చేపట్టబోమని స్పష్టం చేసింది.
బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో నియామకాలూ చేపట్టం
తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి
సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ
కొత్త చట్టంపై స్టే ఇవ్వొద్దని అభ్యర్థన
అంగీకరించిన ధర్మాసనం
అభ్యంతరాలపై జవాబిచ్చేందుకు వారం గడువు
ప్రభుత్వ కౌంటర్‌పై తర్వాతి ఐదు రోజుల్లో
రిజాయిండర్లు వేయాలని పిటిషనర్లకు ఆదేశం
విచారణ మే 5వ తేదీకి వాయిదా
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై
ఆ రోజున నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్లబోమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వొదని అభ్యర్థించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లపై, సుప్రీంకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
వక్ఫ్ సవరణ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 72కుపైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే పిటిషన్లలో లేవనెత్తిన అభ్యంతరాలు, ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయకుండా, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు, కేంద్ర కౌన్సిల్‌లో సభ్యులుగా నియమించకుండా చట్టంలోని ఆయా సెక్షన్లపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. దీనిని సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. పార్లమెంటులో విస్తృతంగా చర్చించి, మెజారిటీ సభ్యుల ఆమోదంతో కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం చేసిందని.. ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వడం సరికాదని వాదించారు.
ప్రైవేటు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించారంటూ దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ విజ్ఞప్తులు రావడం వల్లే పార్లమెంటు వక్ఫ్ చట్టాన్ని సవరించిందని వివరించారు. కేవలం ఆయా సెక్షన్లను పైపైన చదివి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. వారం గడువు ఇవ్వడం వల్ల వక్ఫ్ ఆస్తులకు వచ్చే ముప్పేమీ ఉండదని.. స్టే ఇవ్వడం వంటి కఠిన చర్యలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.వక్ఫ్ సవరణ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 72కుపైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వాటిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. అయితే పిటిషన్లలో లేవనెత్తిన అభ్యంతరాలు, ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయకుండా, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు, కేంద్ర కౌన్సిల్‌లో సభ్యులుగా నియమించకుండా చట్టంలోని ఆయా సెక్షన్లపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. దీనిని సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. పార్లమెంటులో విస్తృతంగా చర్చించి, మెజారిటీ సభ్యుల ఆమోదంతో కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం చేసిందని.. ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఇవ్వడం సరికాదని వాదించారు. ప్రైవేటు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించారంటూ దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ విజ్ఞప్తులు రావడం వల్లే పార్లమెంటు వక్ఫ్ చట్టాన్ని సవరించిందని వివరించారు. కేవలం ఆయా సెక్షన్లను పైపైన చదివి చర్యలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. వారం గడువు ఇవ్వడం వల్ల వక్ఫ్ ఆస్తులకు వచ్చే ముప్పేమీ ఉండదని.. స్టే ఇవ్వడం వంటి కఠిన చర్యలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
తదుపరి విచారణ వరకు వాటి జోలికి వెళ్లం..
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికే మొగ్గు చూపింది. ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉందని, సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనితో తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. దీనిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని స్టే పై వెనక్కితగ్గింది. ‘‘తదుపరి విచారణ వరకు ‘వక్ఫ్ బై యూజర్’, బోర్డులు సహా ఎలాంటి వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేయబోమని సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. సవరణ చట్టంలోని 9, 14 సెక్షన్ల కింద ఎలాంటి నియామకాలు చేపట్టబోమని, ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో నియమించబోమని చెప్పారు. ఈ అంశాలను నమోదు చేసుకుంటున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం కౌంటర్ వేశాక.. దానిపై ఐదు రోజుల్లోగా రిజాయిండర్లు వేయాలని పిటిషనర్లకు సూచించింది.
ఐదు పిటిషన్లపైనే వాదనలు వింటాం..
పిటిషన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అందులో ఐదింటిలోనే వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. ఇందుకోసం ముగ్గురు న్యాయవాదులను నోడల్ కౌన్సెల్‌గా నియమిస్తామని, ఎవరెవరు అందులో ఉండి వాదనలు వినిపిస్తారో మీరే నిర్ణయించుకోండి అని సూచించింది. విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వక్ఫ్ చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News