Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:01 PM
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.

ఛత్తీస్‌గఢ్, మార్చి 20: మావోయిస్టులకు (Maoist) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరహిద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు జాయింట్ టీమ్ బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా.. ఘటనస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.
ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజాపూర్ డీఆర్జీకి చెందిన ఒక సైనికుడు ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందాడు. ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక... వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగులుతోంది. ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది. ఈరోజు బీజాపూర్‌లో అతిభారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు 22 మంది మావోలు హతమవగా.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం చుట్టూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలో పెద్దఎత్తున ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ముఖ్యంగా మావోయిస్టు కంచుకోటగా ఉన్న బస్తర్ ప్రాంతమే టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది. అటు తెలంగాణలో కూడా భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా అణచివేత ఉండటంతో తెలంగాణలో మావోయిస్టులు ప్రవేశించకుండా గ్రౌహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
Read Latest National News And Telugu News